ఒక్కమాటు నీ ముఖం చూడనీ - (ముఖం చిట్లిస్తూ) శరత్కాల చంద్రుణ్ణి పరిహసించే అంత చక్కని నీ ముఖం ఇలా అయిపోయిందేం కజ్జలా. ఎంత పాలిపోయింది నీ శరీరం. కామదేవుణ్ణి తప్ప కొలవలేనన్న నీవు నీకు తెలియకుండానే విభూతి ధారణం చేసి శివదీక్ష పుచ్చుకున్నావనిపిస్తున్నదే నీ దేహం. ఏదీ నీ చెయ్యి (అందుకొని) కాక తగిలినట్లున్నది... ఎందుకో నీవు బాగా లేవు. నీ మనస్సు బాగా లేదా? కజ్జల : తాము నా ఆరోగ్య విషయంలో అతిశ్రద్ధ వహిస్తున్నారు. నాకేమీ జబ్బులేదు. ఈ ప్రజల సంతోష కోలాహలము కనులార చూచి ఆనందిస్తూ ఉన్న నా మనస్సు బాగా లేకపోవటానికి అవకాశం కూడా లేదు. రాణి : కజ్జలా! ఏ విధమైన అనుమానం ఉన్నా దాచిపెట్టవద్దు. నాతో చెప్పటానికి నీకేం దాపరికం గనుక... ఈనాడే నా దగ్గరికి ఒక మానస శాస్త్రవేత్త వచ్చాడు. పంపనా! భూతవైద్యులలో ప్రఖ్యాతి గన్న పశుపతినాథుడు ప్రస్తుతం మన శ్రీనగరములోనే ఉన్నాడట - ఎందుకు వృధాగా రోగాన్ని కప్పిపెట్టి తరువాత ఎందుకు అపమృత్యువును ఆహ్వానిస్తావు కజ్జలా! నీ వియోగాన్ని నేను భరించగలుగు తానా? ఎలా భరించటం. భరించలేను కజ్జలా! కజ్జల : (వ్యంగ్యోక్తిగా) తమ సేవకు నా బ్రతుకు ఇంత అత్యంతావశ్య కమని ఎన్నడూ గుర్తించలేకపోయినాను. తాము క్షమించాలి. రాణి : అదే కాదు నేను అలవాటుపడ్డ వాళ్ళలో తప్ప మెలగలేను. అయిష్టమైన వాళ్ళను ఆదరించగలుగుదును గాని కొత్త మొగాలతో పరిచయమంటే నాకేమిటో భయమేస్తుంది కజ్జలా! - చూడలేను. కజ్జల : (రాణి మాటలను జాగరూకతతో అవగతం చేసుకుంటున్నట్లు వర్తిస్తుంది) రాణి : నీకూ నాకూ ఉన్న అనుబంధం ఈనాటిదా అలా అనుకోగానే తెంచి వేసుకోటానికి. నీ ప్రాణానికి ఏదైనా అపాయం కలిగితే అది నా ప్రాణానికీ అపాయమే. నా మంచికోసం, ఆత్మరక్షణ కోసం నిన్నర్థిస్తున్నాను కజ్జలా! నీవు ఈ విధంగా బాగా లేకపోవటానికి కారణమేమిటో బయటపెట్టు. ఎంత ఆదరానురాగాలతో ప్రజలు నీకు జయపెడుతున్నారో వింటున్నావా? ఆ జయఘోషలవల్ల నీకు వెర్రెత్తటం లేదూ? కజ్జల : అది నాకు సంతృప్తి కలిగించలేదు. సంతృప్తికి మించిన తరువాత గదా ఉన్మాదం ఉత్తమాత్మలకు తను యూహాగానం వినటం కన్నా వేరే సంగీతమే లేనప్పుడు... 378 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/378
Appearance