Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కంచుకి : (కుమారుణ్ణి కజ్జలాదేవి చేతి కందిచ్చి చెప్పినట్లు చేస్తాడు. మాటిమాటికీ ప్రజలలో హర్షధ్వనులు చెలరేగుతూ వినిపిస్తవి. కజ్జలాదేవి పట్టరాని సంతోషంతో దీర్ఘంగా నిశ్వాసిస్తూ కొంతసేపు నిలవబడి పసిబిడ్డతో వెనకకు వచ్చి పర్యంకం మీద కూర్చొని) కజ్జల : అమాత్య కంచుకీ - కంచుకి : ఆమె ఎవరు? తల్లీ కజ్జల : మన మహారాణి. కంచుకి : మొగం చెల్లలేదేమో. ఆమె ఇంకా పిల్లవాణ్ణి చూచిపోవటానికి రాలేదు. - (మహారాణి వస్తూ ఉన్నట్లు సూచించే ప్రాసాద ఘంటికలు వినిపిస్తవి) (ప్రవేశము రాణి. కంచుకి తదితరులూ ప్రక్కకు తప్పుకుంటారు. కజ్జల లేచి సగౌరవంగా ఆర్ధాసన మిచ్చి, గౌరవించిన తరువాత) రాణి : కజ్జలా! నిన్న సాయంత్రం నిన్ను గురించి ఎంత ఆదుర్దా పడ్డానో విన్నావా? ఇంకేముంది అయిపోయిందన్న వార్త వినేటప్పటికల్లా నా గుండె గుభేలు మన్నది. ఇంతకు పరమశివుడి కృప నీ మీద ఉన్నది. యముడి నోట్లో గడ్డకొట్టి బ్రతికావు. అంతటి క్రితం రాత్రి నీ మీద పీడకల కూడా వచ్చింది సుమా. కజ్జల : మీ ఆదరానురాగాలకు ఎంతో కృతజ్ఞురాలను. అనవసరమైన పీడకలలతో మీ నిద్రకు నావల్ల ఏమీ భంగం రాలేదు కద. రాణి : ఉహూ - బలే మంచి సందేహమే కలిగింది కజ్జలా! లోకమంతా ఒక్కమాటుగా తారుమారైనా ప్రస్తుత స్థితిలో నా నిద్రకు ఏ విధమైన భంగమూ కలగదు. పట్టుపట్టి ప్రయత్నించినా ఏ పరమ దౌర్భాగ్యుడూ పంతం చెల్లించుకోలేడు. (కజ్జల ముఖం కేసి చూస్తూ) అయినా ఒకప్పుడు మాత్రం ప్రతినిత్యమూ నా పర్యంకం దుఃఖభాష్పాలతో పంకిలమైపోయినమాట వాస్తవము. అయినా ఏం ప్రయోజనం... నిద్ర పట్టించుకొనక తప్పింది కాదు. తరువాత క్రమక్రమంగా అలవాటు పడ్డాను. ఆ కజ్జల జలమూ ఇంకి పోయింది. నా పర్యంకం పంకిలం కావటమూ మానివేసింది. (ఆ ప్రసంగాన్ని తుడిచివేసినట్లుగా చప్పరించి) కజ్జలా, ఏదీ ఒకమాటు ఇలారా. (తానే దగ్గరికి పోయి) ఏకాంకికలు 377