Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మల్లన్న : తల్లీతండ్రిని ఒంటరిగా విడిచిపెట్టి - స్వర్గమిచ్చినా బయలుదేరను మామా. శ్రీనాథుడు : ఈ పండీ పండని పొలాలను నమ్ముకొని దున్నుకుంటూ కర్షక వృత్తితోనే జీవిస్తావన్నమాట. మల్లన్న : ఈ వృత్తిలో ఉన్న స్వాతంత్య్రం సౌఖ్యం రాజ సౌధాలల్లో కూడా లేదనే నా నమ్మకము మామా! శ్రీనాథుడు : సరే బాగుంది. వినని వాడికి చెప్పేదెవరు? (లేస్తాడు) అక్కయ్యా! వీడి వ్యవహారం కూడా తేలిపోయింది. బావగారూ సెలవు. పోతన్న : చీకటిపడబోతుంటే ఇప్పుడెక్కడికి పోదామని. మాచమ్మ : అన్నం తిని పోదువుగాని - పండువంటి సంబంధం పోతే పోగొట్టుకున్నాను గాని. శ్రీనాథుడు : నన్ను అనవసరంగా బాధపెట్టవద్దు - (బోయీలను ఉద్దేశించి) ఒరేయ్! పోతన్న : శ్రీనాథా! శ్రీనాథా! (చకచకా నడిచిపోతాడు) మాచమ్మ : తరతరాల నుంచీ వచ్చే సంబంధం చేతులారా పోగొట్టుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా, ఈనాటితో నాకూ నా పుట్టింటికి ఋణం తీరిపోయింది. (కన్నీళ్లతో) మల్లన్నా నీవైనా వాడివెంట వెళ్లరా? మల్లన్న : నీవు వెళ్లు - ఇక్కడ కష్టపడకపోతే- మాచమ్మ : ఇంతకూ నేను చేసుకొన్న ప్రారబ్దం - ఈ ఘటం కాస్తా హరీ ఎవరు పట్టుకొని పాకులాడుతారు. ఎవరికి ఏం పట్టింది. అన్నా వాళ్లు మల్లన్న : అమ్మా! ఏం ప్రయోజనం ఈ మాటలతో - పోయి త్వరగా మడికట్టుకో - మాచమ్మ : నా కడుపులో ఎంత మండిపోతున్నదో నీకేం తెలుసు - ఎవర్నీ ఏమీ అడగరట! మల్లన్న : వంటకానివ్వు పోవే - మాచమ్మ : ఏం బెట్టి - చేతులూ, కాళ్లు, నా కెందుకొచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి - ఈ పూటకు బియ్యం లేవు, ఉప్పులేదు, పప్పు లేదు. 368 (సురాళించుకొంటూ వెళ్ళిపోతుంది) వావిలాల సోమయాజులు సాహిత్యం-2