నాలుగవ దృశ్యం (ఒక మంచం మీద పోతన కూర్చొని చెపుతూ ఉంటే మల్లన్న వ్రాస్తూ ఉంటాడు. చెప్పలేక చెపుతూ మధ్యమధ్య పోతన్న జ్వరంతో దగ్గుతూ బాధపడుతూ ఉంటాడు) పోతన్న : ఖోర్, ఖోర్... ఘోర్ (దగ్గుతాడు) మల్లన్న : నాన్నా! అంత ఆయాసపడుతూ ఇప్పుడు చెప్పలేక చెప్పలేక చెప్పకపోతే ఏం ముంచుకు పోతున్నది గనుక - పరిసమాప్తం చేయలేక పోతారా, పోనీ జ్వరం బాగా నయమైన తరువాత వ్రాయకూడదూ, ప్రస్తుతము కట్టిపెడదామా? పోతన్న : అలా కాదులే ... నా మాట విను నాయనా, ఏం వ్రాశావు. ఖోర్, ఖోర్, ఖోర్ - (దగ్గుతాడు) మల్లన్న : అదుగో అదేకొంప తీసేది. నిన్నా మొన్నా లేదు. మళ్ళీ వెంట పడ్డది. చాలా చెడ్డదని వైద్యుడు నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకున్నా వినిపించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు. విశ్రాంతి అవసరం మీ నాన్న గారికని ఇందాక రామస్వామి ఆలయం ముందు కనిపించి మళ్ళీచెప్పాడు. పోతన్న : (దగ్గుతూనే బాధతో) నన్నేం చేయమంటావురా, నేనేం ఈ దగ్గును రమ్మని పిలిచిపీట వేశానా? మల్లన్న : కావాలని తెచ్చి పెట్టుకోడం కాకపోతే ఏమిటిది. ఈ విధంగా మనస్సుతో శ్రమచేస్తే ఎంత ప్రమాదం. పోతన్న : ఖోర్, ఖోర్, ఖోర్ - పరిగెత్తే మనస్సును ఎంత పట్టుకుందామన్నా చేత... కావటం లేదు. మల్లన్న : పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉంటుందా? పోతన్న : (దగ్గుతూ) ఆ కొరత కొంచెం పూర్తి అయితేగాని నాకు నిద్రపట్టదురా మల్లన్నా, నన్నెందుకు బాధ పెడతావు. నా మాట విని... కట్టిపెట్టకు... నశ్వరమైన ఈ దేహానికి ఎప్పుడేదో, రామచంద్రమూర్తికి బాస ఇచ్చాను. చెల్లించుకోలేక పోతే చివరకు ఆ ప్రభువుకు - ఖోర్... ఖోర్... ఖోర్... నాయనా ఏదీమూలం? కానివ్వు ...(తల పట్టుకొని) రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో! ఏకాంకికలు 369
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/369
Appearance