Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాచమ్మ : (ప్రవేశించి) అంటేనా మల్లన్నకు మావాడు పిల్లనివ్వ దలచుకున్నాడు. చూడబోతే మన ఇంట్లో సూర్యచంద్రాదులు తప్ప ఏమీ లేకపోయెను. ఏమని ఇస్తాడు. వాణ్ణయినా వాడివెంట పంపిస్తే ఇంత పెద్దవాణ్ణిచేసే వాడనుకుంటే అదీ ఆలోచించకపోతిరి. వాడి మెడకు వ్యవసాయం గుదిగొయ్య తగిలించి ఒక వేదాంతిని చేసి కూర్చోపెడితిరి. పోతన్న : అయితే ఏతావత మల్లన్న పెళ్ళికోసం నాకు ఏ మహారాజుకో కాళ్ళుకడిగి కన్యక నర్పించుకోటం తప్పదన్నమాట! అదేనా మీ అభిప్రాయం. రామచంద్ర ప్రభో, రామచంద్ర ప్రభో! (మల్లన్న ప్రవేశిస్తాడు) శ్రీనాథుడు : ఏదో నాకూ కొంత బాధ్యత ఉండబట్టి చెప్పదలచుకున్న మాట లేమిటో నాలుగూ బయట పెట్టాను. తరువాత మీ ఇష్టం. మాచమ్మ : మన బాగు కోరే గదా వాడు ఏదిచెప్పినా? అంత మీకు తలకు ఎక్కకపోతే ఎవరేం చేస్తారు. ఏమిటా విస్తుపోయి దొంగలు పడి కొంప దోచుకుపోయినట్లు ఆ దిగులూ మీరూ, ఎందుకా తలపట్టుకొని కూర్చోవటం - ఏమిరా మల్లన్నా! మామ ఏమన్నాడో వింటున్నారా? మల్లన్న : వినకేం, అన్నిమాటలూ లోపలికి వినిపిస్తూనే ఉన్నవి. మాచమ్మ : అయితే నీ యభిప్రాయమేమిటో స్పష్టంగా మామతో తేల్చిచెప్పు. - మల్లన్న : నా కోసమని ఆయన మనస్సుకు నచ్చని పని బలవంతం చేసి ఆయనచేత ఒప్పించటానికి నేను ఎంత మాత్రమూ అంగీకరించను అయినా నా పెళ్ళికీ - ఆయన గ్రంథం ఏ రాజుకో అంకితమివ్వటానికి ఎక్కడి సంబంధం? మాచమ్మ : అయితే మామతో సంబంధం వదులుకోటానికే నిశ్చయించుకున్నావన్న మాట. మల్లన్న : భాగవతాన్ని మానాన్న మహారాజుకు అంకితమివ్వకపోతే నాకు పిల్లనివ్వటానికి వీల్లేదన్న మాట! శ్రీనాథుడు : ఏం చూచి ఇవ్వమంటావు? పోతన్న : సంప్రదాయం చూచి - సౌశీల్యం చూచి. 366 వావిలాల సోమయాజులు సాహిత్యం-2