Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోతన్న : (చెవులు మూసుకొని) ప్రభో! రామచంద్ర ప్రభో! శ్రీనాథుడు : మీరు కోరుకున్నది ఇప్పిస్తాను. పోతన్న : మా 'ఓలి' ఈ మండలాధిపతులు ఏమివ్వగలుగుతారు. శ్రీనాథుడు : మీరు కోరినది ఇప్పించే భారం నాది. పోతన్న : నాకొక శాశ్వత మహాదానం చేయించాలి. శ్రీనాథుడు మీరు కోరిన గ్రామం శాశ్వతవృత్తులతో దాన మిప్పేంచేటట్లు - అంగీకరిస్తారా. పోతన్న : శాశ్వత వృత్తులతోనా! - కల్ల నాయనా! పిచ్చివాడా, సగరుడు, మాంధాత, నహుషుడు, నాభాగుడు - ఎంతెంత మంది మహాచక్రవర్తులు ఈ లోకంలో జన్మించారో మృత్యువులు తప్పించుకొని చిరంజీవులైన వాళ్లే అరుదు. అంతటివారే అశాశ్వతులైనప్పుడు ఈ సామాన్య మహా మండలాధిపతులు శాశ్వతులా - వీరు నాకేవిధంగా శాశ్వతదానం చేస్తారు. ఆ శాశ్వతమైన బ్రతుకుతో నేను శాశ్వత దానానికి ప్రతిగ్రహీతను ఎలా కాగలను. శ్రీనాథుడు : బావగారూ, మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు పోనీ కర్ణాట చకవ్రర్తిచేత కనకాభిషేకం చేయిస్తాను - ప్రతిగ్రహీతలుకండి. కావ్యకన్యక నిచ్చి కల్యాణం చేయించండి. పోతన్న : నాయనా! శ్రీనాథా! కర్ణాటభూపతి చేత కనకాభిషేకం చేయించినా - కేవలం కనక కల్పితమైన అగ్రహారం దానం చేయించినా అతడు నా కావ్యకన్యకను వరించటానికి తగ్గ వరుడు మాత్రం కాలేదు. అయినా నాకీ రాజుల వివక్షతో పని ఏముంది. ఆమెను ఎన్నడో పురుషోత్తముడి కిచ్చి ధారవోసి తరించటానికి నిశ్చయించుకున్నాను. శ్రీనాథుడు : ఇంత వృద్ధాప్యంలో కూడా మీరు ఈ దారిద్య్ర దేవతకు స్వస్తి చెప్పటానికి సంకల్పించుకోలేదన్నమాట. పోతన్న : అబ్బాయీ! అనిత్యాలైన ఈ శరీరాలకు ఈ దారిద్ర్యమెన్నాళ్లు, ఈ సుఖాలెన్నాళ్లు, క్షణకాలం అయినా నా దారిద్య్రం ఎవరినీ బాధపెట్టేది కాదే. శ్రీనాథుడు : ఇదివరకు బాధ పెట్టకపోయినా ఇక ముందు బాధపెట్టక మానదు. పోతన్న : అంటే- ఏకాంకికలు 365