శ్రీనాథుడు : వీరభద్ర విజయం వంటి వీరశైవ కావ్యాల మీద నుంచి ఒక్కమాటుగా మనస్సు భాగవతం మీదికి ప్రసరించి వేదాంతవీథి విహారం చేయటానికి సంకల్పించింది. మల్లన్న : ఏమో మామా! ఈ పద్యమేమిటి ఈ దైవప్రార్థన మేమిటి నాన్నా అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే - స్నానంచేసి గంగ ఒడ్డున తారకమంత్రం జపించుకుంటూ కూర్చున్నానురా అబ్బాయీ, ఇంతలో కనుచూపు మేరలో మెరపుచెంగట ఉన్న మేఘములాగా ఒక దేవతా స్త్రీతో ఒక శ్యామసుందర మదనమోహనమూర్తి నా కళ్ళకు కట్టింది. అటే తదేక దృష్టితో చూస్తూ ఉండగా కొంతసేపటికి ఎక్కడో చూచినట్లు అనుమానం కలిగింది. స్మరణకు వచ్చి ప్రభూ! అని కేక వేసేటప్పటికి శ్రీ సీతారామ పరబ్రహ్మము నా చేరువకు వచ్చి 'పోతన్నా ఏ మహాకవి చేతనైనా భాగవతము ఆంధ్రీకరణము చేయిద్దామనే సంకల్పంతో వచ్చాను. నీవు చేస్తే బాగుంటుందని కోరటానికి వెతుక్కుంటూ వచ్చాను. నాకు బాసట ఇస్తేగాని వెళ్ళిపోనని చేతులో చేయివేయించు కుని తిరోహితుడై నాడురా ప్రభువు' అని చెప్పారు. శ్రీనాథుడు : (వ్యంగ్యగర్భితంగా) ఒక కావ్యమన్నా కవి సమాజాల నోట పడకుండానే, మహారాజుల మన్నన పొందకుండానే బావగారు రామచంద్రమూర్తి మమతతో ఆర్థించి కావ్యాన్ని వ్రాయించుకోదగ్గ మహాకవి ఐనారు. అందుకు సంతోషము. మల్లన్న : ఈ రాజులూ తరాజులు మన్నిస్తేనేం మన్నించకపోతేనేం, చూస్తున్నాంగా లోకంలో ప్రచారంలో ఉన్న కవి సమాజాలన్నిటినీ, చిత్తచాంచల్యంతో చెలరేగుతూ ఉన్నవి. కవి సమాజాలంటే బాగుంటుంది. అటువంటి వాటి నోటికెక్కితేనేం ఎక్కకపోతేనేం. రాజాధిరాజు, రాజ పరమేశ్వరుడు రామచంద్రమూర్తి స్వయంగా వచ్చి అర్థించిన తరువాత. శ్రీనాథుడు : (గర్భితంగా) తనను మహాకవిని చేసిన రామచంద్రమూర్తిని బావగారు కృతిపతినైనా చేయటానికి సంకల్పించుకున్నారా? మల్లన్న : మామా అది వేమభూపతి కృపావీక్షణం లేనిదే ఘంటం బెత్తెడు సాగని నీకది నచ్చుతుందా. శ్రీనాథుడు : (చిరునవ్వుతో) మల్లన్న - మీనాన్న నిరాశలో పడ్డారు. నిరాశకు పుట్టిల్లు భ్రాంతి. భ్రాంతి తన్నాశ్రయించిన వాళ్లకే కాదు వాళ్ల మాటలు వినేవాళ్ళకు కూడా మతి పోగొడుతుంది. 356 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/356
Appearance