శ్రీనాథుడు : ఆఁ..... సాహసమో...... శక్తో...
మల్లన్న : సాహసమో, శక్తో.... వినాలి. ఇప్పుడే వస్తాను.
(లోపలికి పోయి ధావళీకట్టుకొని భాగవతము తీసుకోవస్తాడు. శ్రీనాథుడు ఈ లోపల అటూ ఇటూ పచారు చేస్తూ ఆలోచిస్తుంటాడు)
(కృష్ణాజినం మీద మడికట్టు కొని కూర్చొని మల్లన్న గ్రంథ ప్రారంభం చేయబోతూ)
మల్లన్న : మామా! మొదలు పెట్టమన్నావా?
శ్రీనాథుడు : (పచారుచేస్తూనే) అబ్బాయీ! మీ నాన్న కవితా ధోరణి ఏమన్నా మారిందా? లేకపోతే వెనకటి వేళ్ళలోనే నడుస్తున్నదా బండి.
మల్లన్న : వెనుకటి వేళ్ళలోనంటే?
శ్రీనాథుడు : భోగినీ దండకమా, వీరభద్ర విజయమూ రెండు నడిచిన వేళ్లు-
మల్లన్న : ఏమో అదంతా నీవే చెప్పాలి.
శ్రీనాథుడు : శైలిలో మార్పేమీ నీకు కనిపించలేదా! ఔచిత్యాన్ని ఆదరించటమూ, అనౌచిత్యాన్ని పరిహరించటమూ, భావాన్ని ఉపలక్షించటమూ వీటికేమన్నా ప్రయత్నించాడా. 'ముక్కస్య ముక్కార్థః' కాదుగదా?
మల్లన్న : ఆయనకు ఈ విషయమైన భ్రాంతే ఉన్నట్లు నాకు తోచలేదు.
శ్రీనాథుడు : మరి?
మల్లన్న : ఒకనాడు ప్రాతఃస్నానం చేసి గంగ నుంచీ యింటికి వచ్చి 'మల్లన్నా ఘంటం తాళపత్రం త్వరగా తీసుకోరా అన్నారు. తీసుకోవచ్చాను. తదేక దృష్టితో ఏ విధమైన స్మరంతీ లేకుండానే చెప్పేది వ్రాయమన్నారు. వెంటనే చెప్పండి అన్నాను. ఆయన -
"పలికెడిది భాగవతమట.
పలికెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాథ పలుకునేలా”
అని చెప్పి దేవతా ప్రార్థనము చేశారు. నేను వ్రాశాను.
ఏకాంకికలు
355