మాచమ్మ : తరువాత?
మల్లన్న : ఏముంది. మేనాలో ఉన్న అంత మామా అమాంతంగా దిగివచ్చి కొంటెతనంగా వెనక ఎరగనట్లు 'ఎవరబ్బాయివిరా నీవన్నాడు' - మనస్సులో చేయిపెట్టి కలిచినట్లయింది నా పని. ఆపుకోలేక రాజాస్థానాలల్లో కవితా సేవకు కుదరలేక కేదారఖండాన్ని నమ్ముకున్న ఒక కర్షక కవి కుమారుణ్ణన్నాను - పెడసరంగా.
మాచమ్మ : ఎందుకన్నావు ఆ మాట. వాడికి కోపం రాదూ?
మల్లన్న : ఏం వస్తే? నన్నేం తలగొట్టి మొలేస్తాడా?
మాచమ్మ : అయినా వాడు కాస్తకూ కూస్తకూ కోపం తెచ్చుకునే స్వభావం కలవాడు కూడా కాదులే. ఆఁ
మల్లన్న : ఓరి నీవట్రా మల్లన్నా? ఓరి నీ తస్సదియ్య ఎంతవాడివైనావురా? నేనెవరినో ఎరుగుదువా? ఎప్పుడో చిన్నతనంలో చూచానురా? చిన్నప్పుడు నీచేత నా నైషధంలో పద్యాలు వల్లె వేయించే వాణ్ణి మా ఇంటికి వచ్చినప్పుడు అని మంచి చేసుకొని మేనాలో ఎక్కు ఇంటికి పోదామన్నాడు. నీవు పద, నేను ఎడ్లకు మేతవేసి నీడనకట్టి వస్తానన్నాను.
మాచమ్మ : పాపం. మేనాఎక్కి రాకపోయినావా? వాణ్ణి ఎంత చిన్నబుచ్చావురా?
మల్లన్న : నన్ను చిన్నబుచ్చటం నీకు నచ్చిందేం? ఇంకా ఇంటికి చేరలేదే, అరఘడియైనా. మనం పేదవాళ్ళమనీ మన ఇంట్లో మర్యాదలు సక్రమంగా జరగవనీ ఇంకెవరింట్లోనైనా విడిది దిగారేమో మామగారు.
మాచమ్మ : మల్లన్నా! మామను ఎంత అన్యాయం చేస్తున్నావురా!
మల్లన్న : ఇంతసేపైతే మరి ఎక్కడికిపోయి ఉంటాడంటావు - ఆఁ ఎక్కడికేమిటి? మరిచి పోయినాను. ఉందిగా మా అత్త భోగినీదేవి. దేశదేశాల నుంచీ తెచ్చిన చీరెలూ, సారెలూ ముందు అక్కడ చెల్లించుకోరావద్దూ?
మాచమ్మ : అది గోపాలోత్సవాలకు రాచకొండ వెళ్లిందటగా. దాని ఇంటికెందుకు వెళ్ళుతాడు. మా ఇంటావంటా లేవే అటువంటి గుణాలు. ఎందుకురా అన్యాయంగా అంతంత అభాండాలు వాడినెత్తిన వెయ్యటం?
ఏకాంకికలు
347