Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమితావి : అలాగా అమ్మా! బుద్ధభగవానుని హయరత్నం పేరు వీటికి పెట్టుకున్నాను. మీరు పాములకు ఆట నేర్పారట! ఉత్పల : ఎందుకా ఆశ్చర్యం? వాటిని పెంచటం చాలా సులభం. అమితావి : మొన్న ఆరామానికి ఒక ఉపాసిక శ్రావస్తి నుంచి వచ్చింది. ఆమె పులులను పెంచిందట! ఉత్పల ఆమె చపలా ఏమిటి చెప్మా! అమితావి : ఆమె ప్రాకృతంలో కవిత్వం కూడా చెప్పుతుంది. ఉత్పల : అయితే సుజాత ఐ ఉంటుంది. ఓ సుప్రసిద్ధ రాజనర్తకి. అమితావి : ఆమె పెంచే పులులు... అమ్మా! అరుగో భదంతులు. భదంతుడు : అమ్మా! పూర్వ శైలం మీద ఆనందభిక్షువుతో మాటాడి రావటంలో ఆలస్యమైంది. ఉత్పల : భదంతా! ఇక్కడ నాకే లోపమూ జరగలేదు. అమితావి : భదంతా! కొన్నాళ్ళ క్రితం ఒక నర్తకి వచ్చిందే ఆమె పులులను పెంచుతుందట విన్నారా? భదంతుడు : ఆమె కవయిత్రి అని మాత్రం నాకు తెలుసు. అమ్మా, నీకామె తెలుసునా? ఇప్పుడెక్కడుంది? ఉత్పల : ఔను! ఇప్పుడామె ఊరూపేరూ లేదు. పాపము కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది (పక్షుల కిచకిచలు, కూతలూ దూరంనుంచి వినిపిస్తవి) అమితావి : అదిగో! కంటకాలు. ఆకాశం నుంచి దిగి వచ్చినట్లున్నవి. దాహం ఇచ్చి వస్తాను. ('గు'గ్గూ అంటూ నిష్క్రమణ) భదంతుడు : అమ్మా! జ్ఞప్తికి రావటం లేదు, ఆమె పేరేమిటన్నారు? ఉత్పల : సుజాత... భదంతుడు : ఔను సుజాత... ఈ అతిథి గృహంలో ఆమె వ్రాసిన గీతం ఒకటి చెక్కించింది. అదిగో. ఏకాంకికలు 321