అమితావి : తమ్ముడూ! నీకేం తెలియదు. నందుడు : అన్నా! నీకు అంతకంటే తెలియదు. అమితావి : (ప్రశాంతంగా ధర్మ ప్రవచనం చదవటం ప్రారంభిస్తాడు) 'నగామ ధమ్మో నో నిగమస్సధమ్మో నందుడు : బాబో! ఈ రొద భరించలేను (వీణ తంతులు 'టింగ్ టింగ్' మనిపిస్తూ నెమ్మదిగా రాగాలాపన చేస్తూ వెళ్ళి పోతాడు) అమితావి : అమ్మయ్య! 'నచా పియం ఏక కులస్యధమ్మో (ఒక నర్తకి నడుస్తూ వస్తున్న కాలిగజ్జెల చప్పుడు) ఉత్పల : మీ ఏకాంతతకు భంగం కలిగిస్తున్నాను, క్షమించాలి. అమితావి : అమ్మా! ఇది అతిథి గృహం. మీ సత్కారం కోసం భదంతుల వారు నన్ను ఇక్కడ ఉండమని ఆజ్ఞాపించారు. అదుగో ఆ వేదిక మీద కూర్చోండి కొంచెం దాహం తెచ్చి ఇవ్వ మంటారా? - ఉత్పల : అవసరం లేదు. (వేదిక దగ్గిరకు నడిచి వెళ్ళిన కాలిగజ్జెల చప్పుడు) అమితావి : అమితాభ దేవాలయానికి వెళ్ళి రావటంలో శ్రమ పడినట్లున్నారు? ఉత్పల : అలవాటు లేక కొంచెం శ్రమ అనిపించింది. శ్రావకా! ఇంత నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా ఉండటం మీకు కష్టమనిపించటంలేదూ? అమితావి : అమ్మా బుద్ధ పూజలో కాలం గడిచిపోతుంది. ఉత్పల : ఏదో చదువుకొంటున్నట్లున్నారు? అమితావి : సాయంత్రం 'ఖేమా' భిక్కుని గాధ చెప్పవలసిందని అగ్రశ్రావకులు సెలవిచ్చారు, ఒకమాటు చూస్తున్నాను. ఉత్పల : ఈ ఆరామంలో చిలుకలనూ, గోరువంకలనూ పెంచి ఆట నేర్పింది మీరే కదూ? అమితావి : (సంతోషంతో) అవును నేనే. ఉత్పల : పాటలి నుంచి ప్రస్తుతం నేను వచ్చింది మీ పారావతాల, చిలుకల ఆట చూచిపోవాలనే. అక్కడ వీటికి ఎంత పేరు ఉందో మీకు తెలియదు. 320 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/320
Appearance