Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గాంధీ పేరూ చెప్పి
కల్లుముంతా వేసి
పిల్లతో ఆటకు
పోరోయ్ బాబయ్య - అహఁ పోరోయ్ బాబయ్య -


చైతన్యం : మోకాళ్లు బ్రద్దలైనా వీడికి కైపు తగ్గినట్టు లేదు.

రంగడు : కైపు. కాఫీ కైపు కాదంటయ్యా! నేను మంతిరినైతే హోటల్లు మూసేయించి పేదోళ్ళకోసం సారాయి షాపులు, కల్లుకొట్లూ కావాల్సినన్ని తెరిపిస్తా.


కాఫీ కంటె నిజము
కల్లు మంచిదండి!
చలవచేసి ఒళ్లు
సత్తు వొస్తుందండి!


చైతన్యం : రేణూ!... ఒక గ్లాసు ఇలా పట్టుకోరా?

రేణు : (సిరప్‌గ్లాసు తెస్తుంది)

చైతన్యం : (రంగడుదగ్గరకు వెళ్ళి) ఇంకా త్రాగుతావా?

రంగడు : తాగుతావా? తాగుతా, మళ్ళీ మళ్ళీ తాగుతా -


ఓరు నువ్వు? రంగణ్ణే ఎరగవ్ -
రంగ డంటె ఓరు?
రాజోయ్ రాజోయ్!!

రంగడంటె ఊరి
రాజోయ్ మోజోయ్!!

ఊరిపెద్ద లంత
వొంగి దణ్ణమెట్టి
దొంగలల్లె మల్లి
తొల్గిపోవాలోయ్! రంగడంటె...


ముసలయ్య : (కోపంతో) ఏడిశావు -

రంగడు : (కోపంతో చూస్తాడు)


240

వావిలాల సోమయాజులు సాహిత్యం-2