చైతన్యం : అలాగే ఒప్పుకున్నాం.
రంగడు : ఓరికి బాకంట!
చైతన్యం : ఇదుగో ఇది పుచ్చుకో.
రంగడు : 'ఓవ్' (తాగి తృప్తి నటిస్తూ)
ఎంత చక్కనిదానివే రంగిరీజు పిల్లా! ని
న్నే తల్లి గన్నదే రంగిరీజు పిల్లా!!
వంగపూవు కొప్పులోన,
వాలిపోయె సొగసు చూస్తె
ఒళ్ళు ఝల్లుమన్నదే
కళ్ళు చల్లనైనవే! ఎంత చక్కని....
పిల్ల అంటె పిల్లవా?
కల్లువంటి పిల్లవే!
ఒళ్ళు పనస తోటలే
కళ్లు మంచుతునకలే! ఎంత చక్కని....
కళ్లుకళ్లు కలిపి నీవు
ఒళ్లువిరిచి చూస్తివంటె
బాటలోన వెలుతురూ
తోటలోన తొలకరీ. ఎంత చక్కని.....
చైతన్యం : (గట్టిగా) రంగడూ!
రంగడు : ఆఁ
రంగడు : ఓరు - చైతన్యం బాబయ్యా! బుద్ధి, బుద్ధి సామీ! మళ్ళీ తాగితే ఒట్టు బాబయ్యా, ఆడు పోయించాడు!
చైతన్యం : ఉ. పానపిశాచానికి ఇంత లొంగిపోయినావన్నమాట! మీవల్ల ఎవరికి ఉపకారమో ఆలోచించావా?
రంగడు : లేదు బాబయ్యా! ఇక తాగితే నామీద ఒట్టు. నా బిడ్డమీద ఒట్టు.
డాక్టరు చైతన్యం
241