Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేణు : (ప్రవేశించి) 1060

చైతన్యం : 1060. క్షణానికొక రకంగా ఉంటున్నది, ఇతని తత్వం. నెత్తిన ఐస్‌బాగ్ పెట్టి టెంపరేచర్ నోట్ చెయ్యి.

(రేణు ఐస్‌బాగ్‌త్ నిష్క్రమిస్తుంది)

(బాబోయ్, అమ్మోయ్, అనే కేకలు వినిపిస్తవి)

ముసలయ్య : (ప్రవేశించి) సారాయికాపు ఊళ్లో మోపైంది సామీ! తాగి తందనాలు వేసి తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నారు.

చైతన్యం : గ్రామాల్లో ఇది ఇంకా ప్రబలంగా ఉంది. అవినీతి ఇంతగా ప్రబలిపోతే ప్రభుత్వం మాత్రం ఎన్నింటికని - వీళ్ళను ఊళ్ళో పెద్దమనుష్యులు పట్టించకూడదూ?

ముసలయ్య : అంతా అలాగే ఉంటారుగాని పట్టించే అయ్య ఎవరో బయటపడలేదు. పట్టిస్తేమటుకు బయమేముంది? మర్నాడే బయటికొస్తారు.

చైతన్యం : ఎలా వస్తారు?

ముసలయ్య : అది మాకేం ఎరుక? ఏదో నల్లబజారుందిట బాబూ!

చైతన్యం : (నిట్టూర్చి) నిజం, దొంగెవరో, దొరెవరో ప్రభుత్వం గుర్తించటం చాలా కష్టంగా ఉంది.

ముసలయ్య : ఆఁ. అన్నిందాలా మా పాణాలు పొయ్యాక అది గుర్తించేం. లేకపోతే ఏం? ఎటు చూసినా బీదోళ్ల బ్రతుకు నరకంగా ఉంది బాబయ్యా!

చైతన్యం : రోజుకూలీలు పెరిగినవిగా....

ముసలయ్య : ఏం ప్రయోజనం సామీ! అడ్డెడమ్మే ధాన్యం అరసోల తక్కువ మానెడు, సోల తక్కువ మానెడు. మళ్ళా మాట్లాడితే మూడు అరసోల్లు. ఉప్పు, మిరపకాయ, చింతపండు, ప్రతిదాని ఖరీదు సుక్కలు సూపిస్తున్నవి. (లోపలనుంచి 'గాంధీ పేరూ చెప్పి కల్లుముంతా వేసి' మొదలైన పాట ప్రారంభిస్తుంది)

చైతన్యం : అదేమిటి?

రంగడు : (ప్రవేశించి)


డాక్టరు చైతన్యం

239