Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైతన్యం : నమస్తే రేణూ!

రేణు : ఒక పేదరైతుకు పాతర తీస్తుంటే కట్లపురుగు కరిచిందట! అతనికి మందు వేసి వస్తున్నా.

చైతన్యం : మంపులు ఎక్కువగా ఉంటే మళ్ళా చెప్పమను. పాపం ఇంజక్షన్ ఇకటి ఇద్దాము. (థర్మామీటరు అందిస్తూ) ఆ ఎల్లయ్యకు టెంపరేచర్ ఎంతుందో చూడు. జబ్బు అర్ధం కావటం లేదు. థౌజండ్ అండ్ ఒన్ కంప్లై యింట్లు.

రేణు : బ్రహ్మయ్య కళ్ళు బాగా నయమైనై. పనిపాటలు చేసుకుంటున్నాడు. మీకు ఏదో బహుమానమిస్తాడట!

చైతన్యం : పేదవాడు గామాలి?

రేణు : చెప్పినా వినేటట్లు లేడు.

చైతన్యం : ఉఁ అంతవరకూ వస్తే నేను నచ్చచెపుతాలే.

(చీటీలు చూచి) బొర్రయ్య!

(రేణు నిష్క్రమిస్తుంది)

బొర్రయ్య : (వచ్చి నిలుచోని దణ్ణం పెడతాడు)

చైతన్యం : (పరీక్షించి) జబ్బేమిటి?

బొర్రయ్య : పోయిన తీర్థానికి చొళ్ళంగిపోతే ఆడ ఓ గోసాయి ముండావాడు నన్ను రాయిలా సేత్తానని మందెట్టుండు బాబయ్యా!

చైతన్యం : (పెదవి విరిచి) మీరు వట్టి వెర్రిబాగులవాళ్ళోయ్ ! అందర్నీ నమ్మి దెబ్బతింటుంటారు.

బొర్రయ్య : సిత్తం, బాబయ్యా!

చైతన్యం : నెలదినాలు గట్టిగా మందు పుచ్చుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం.

బొర్రయ్య : జబ్బు నయమైతే నా కొడుక్కు నీ పెరెట్టుకుంటా బాబయ్యా!

చైతన్యం : ( చీటి వ్రాసియిస్తూ) కొడుకు పుడతాడని గట్టి నమ్మకమే నన్నమాట! సీసా లేకపోతే కంపోండరు నడిగి తీసుకోపో.

(బొర్రయ్య డాక్టరు ఛలోక్తికి నవ్వి నిష్క్రమిస్తాడు)


238

వావిలాల సోమయాజులు సాహిత్యం-2