శకారుడు : ఒరేయ్! చావబొయ్యే సన్యాసి వాడి పాదాలు పట్టుకుంటే ఏముందిరా. ఇవిగో బంగారు పాదాలు పట్టుకో. క్షమిస్తాను. నీకు ఇప్పటికైనా చెప్పి రాజపౌరోహిత్యమిప్పిస్తాను. కుంభీలకుడు : ఆర్యకుడే రాజైతే మీ బావగారి కొకటుంటే గదా! తా దూరను లేదుగాని మెళ్ళో ఒక డోలుట! శకారుడు : ఆఁ. ఒరేయ్ - నేను చారుదత్తుడి చావుచూచి గాని వెళ్ళను. వీడిని వెంట తీసుకోపోయి నా కత్తితో ముక్కలు ముక్కలు చేసి నేను తినేటట్టుగా రాజశాసనం పుట్టించాలి. త్వరగా కానివ్వండి. శోధనకుడు : (చారుదత్తునితో) ఆర్యా! శూలానికి నమస్కారం చెయ్యి. చారుదత్తుడు : (శూలానికి నమస్కరిస్తాడు). గోహ : అయ్యా! భయపడుచున్నారా?. చారుదత్తుడు : భయమా! భయమెందుకు? మృత్యుదేవతా దర్శనం లోకంలో జన్మమెత్తిన తర్వాత దేవతలైనా సూర్యచంద్రాదులకే తప్పలేదు. నా ప్రియురాలిని ఒక్కమాటు స్మరించుకోనీయండి. తరువాత ఈ తుచ్ఛశరీరాన్ని మీ ఇష్టం వచ్చినట్లు - హా ప్రియా! వసంతసేనా- వసంతసేన : (ప్రవేశించి) ప్రభూ! చారుదత్తా!! గోహ : (శూలాన్ని దగ్గిరకు తేబోతుంటాడు). శకారుడు : (ఒకవైపు చూచి) వసంతసేన! - చచ్చామురా, బాబూ దశ్శరభ, శరభో! - (పరుగెత్తబోతాడు). చారుదత్తుడు: (వసంతసేనను చూచి) ఎవరీమె? మృత్యు మహాబిలములో ప్రవేశించిన నన్ను తిరిగి బ్రతికించటానికి వచ్చిన కాటిదేవతా! కాదు. వసంతసేన! (*) ఏమిటి? వసంతసేనా! కాదు. ప్రతిరూపము. పొరబాటు. ఆమె! నన్ను కాపాడటానికి స్వర్గభూమిని విడిచి వచ్చింది. నిజమా ఇది భ్రాంతా? ఆమని పూలతోటలా ఉన్న ఈమె వసంతసేనే! పూర్వ మున్న స్వర్గానికే వెళ్ళలేదు. అమే! వసంతసేన : ఆర్యా! ఔను, మీ వసంతసేననే! వసంతసేన 205
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/205
Appearance