Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వసంతసేన : జీర్ణోద్యానంలో శకారుడు నన్ను పీకనులిమి వెళ్ళిపోయిన తర్వాత రక్షించిన మహాత్ముడు. చారుదత్తుడు : భదంతా! మీకు మేమేమి ప్రత్యుపకారం చేయగలమో! సన్యాసి : ప్రత్యుపకారమా! నాదే మీకు ప్రత్యుపకారం. వీడు పూర్వా శ్రమంలో మీ పాద సంవాహకుడు (వసంతసేనతో) తల్లీ నీకు వెనక ఎన్నడూ చెప్పలేదు. నీవు పది సువర్ణాలిచ్చి జూదరి చేతుల్లో ప్రాణాలు దక్కించిన వాడు వీడే - (వసంతసేన ఆశ్చర్యంతో చూస్తుంది) (విటుడూ, శర్విలకుడూ! నడు, పద, కొట్టు. (శకారుణ్ణి నడిపించుకో వస్తాడు). కుంభీలకుడు : నిన్ను ఏం చేస్తానో చూడు. శకారుడు : నా కొలువులో బతికి నా కొంప తీయిస్తావుటా. శర్విలకుడు : ఆర్యా! ఇడుగో మీ శత్రువు. వీడికి ఏమి శిక్ష విధించాలో మీరే నిర్ణయించాలి. ఆర్యక మహారాజులు మిమ్మలినే న్యాయాధిపతులుగా ఎన్నుకున్నారు. కుంభీలకుడు : (వద్యమాలిక శకారుడి మెడలో వేస్తాడు). శకారుడు : (చారుదత్తుడి కాళ్ళమీద పడుతూ) మహాత్మా! శరణు! శరణు! చారుదత్తుడు : శరణాగతుణ్ణి వదలివేయటము ఆర్యధర్మమూ, ఉత్తమ ధర్మమూ! శకారుడు : (నమస్కారం చేస్తూ) అమ్మయ్య! బ్రతికానురా బాబూ! దశ్శరభ శరభా! మైత్రేయుడు : (ప్రవేశించి) మిత్రమా! ఆర్యకుడు రాజైనాడు (ఆశ్చర్యంతో) వసంతసేనతో (శర్విలకుని చూచి) ఇతగాడిని కలలో చూచినట్లుంది. శర్వీలకుడు : అయ్యా నేను మీ ఇంట భూషణపాత్ర అపహరించిన గజదొంగను. ఆర్యకమహారాజ స్నేహితుణ్ణి. వసంతసేన : మా మదనిక ప్రియసఖుడు! శర్విలకుడు! మైత్రేయుడు : అందుకనే కలలో చూచినట్లున్నా నన్నది. శర్విలకుడు : ఆర్యకమహారాజు తల్లిగారికి వధూ! బిరుదమిచ్చారు. చారుదత్తుడు : ప్రియా! ప్రియవధూ! వసంతసేనా! ఈ రక్తగంధానులేపనం నాకు వివాహోచితాలంకారమే! ఈ వధ్యశిలే మన పాణిగ్రహణవేదిక! 206 వావిలాల సోమయాజులు సాహిత్యం-2