శకారుడు : ఒక్కమాటు నోటితో చంపానని అంటే... చారుదత్తుడు చంపాను. ఆపైన... శకారుడు : క్రింద ఆకాశం పైన భూమి. శూలం క్రింద నువ్వు శూలంపైన నేను. చూస్తారేంరా, ఒప్పుకొన్న తర్వాత శూలమెక్కించక, చూస్తారేం హిం హిం హిం రా? - కుంభీలకుడు: (నురగలు గక్కుతూ ప్రవేశించి) అయ్యా! ఆగండి. ఆగండి, ఆర్యచారుదత్తుడు నిర్దోషి - ఇదుగో రాజశాసనం! శకారుడు : బావా! బాబూ! ఎవరు ఎవరిని చంపితేనేం? మనం ఇంటికిపోయి మంచి . కల్లు. కుంభీలకుడు : ఛీ - వసంతసేనను చంపింది చాలక చారుదత్తుని వంటి పవిత్రమూర్తిని అన్యాయంగా శూలమెక్కిస్తావా? ఇదిగో! రాజాజ్ఞ. శోధనకా! గోహా! శకారుణ్ణి శూలమెక్కించండి. శోధనకుడు : (శాసనం చూస్తాడు) గోహ : రా. అయ్యా రా. పెద్దమనిషివి. శకారుడు : (ఆశ్చర్యంతో) నా ప్రియురాలిని నేను చంపానా! వీడు పచ్చి దొంగ శోధనకా ఇది దొంగముద్ర! - దొంగపత్రం!! (తెరలో కుంభీలకుడు రాజముద్ర చిక్కించుకొన్నాడు. అతడు దొరికితే పట్టుకోవలసిందని రాజాజ్ఞ). శకారుడు : చూస్తారేంరా, పట్టుకోండి. కుంభీలకుడు : (చారుదత్తుడి కాళ్ళమీద పడి) తండ్రీ, నిన్ను రక్షించటానికి రాజముద్ర గూడా దొంగిలించాను. కానీ (కాళ్ళమీద పడతాడు). చారుదత్తుడు : (శిరస్సు మీద చేయి ఉంచి). (*) లే. కృపాళూ, లేవయ్యా! నేనీ రీతిగా మృత్యుముఖాన్ని చేరబోతుంటే నీ ప్రాణాలొడ్డి నన్నెందుకు రక్షింపబూనుకుంటావు. నీవే నాకు ఆప్తబంధుడివి. అయినా నీవు తలపెట్టిన ఈ ప్రాణరక్షాక్రియకు విధాత అడ్డుపడ్డాడు. నాయనా, చింతించకు, నీకు శుభమగుగాక! (కుంభీలకుని లేవదీసి గోహ శోధనకులు పట్టుకుంటారు) 204 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/204
Appearance