Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదహారో దృశ్యం [శ్మశానభూమిలో ఉరికొయ్య అమర్చి ఉంటుంది. చారుదత్తుని శిరచ్ఛేదనానికి బలిపీఠం ఎక్కించుతారు.] శోధనకుడు : అయ్యా! చారుదత్తయ్యా నీ కులదైవాన్ని స్మరించుకో. చారుదత్తుడు : (స్మితం చేసి) కులదైవమా! దైవమంటూ ఒకడుంటే కదా కులదైవము దైవం మీద ఈ లోకానికి నమ్మకం లేదు. అయినా అనుక్షణం దైవాన్ని మరచిపోనూలేదు. దైవమొకడు లేడు - ఇదియథార్థము (*) ఆ దైవమే ఉంటే నీవు వధ్యుడవని ఈ కఠోరశిక్ష నా మీద విధించగలరా? దారుణమైన అపకీర్తి పంకిలం నన్ను అలమింది, విబుధాలయం నుంచి దిగివచ్చి నా ప్రియ దీన్ని క్షాళన చేయుగాక! శకారుడు : (ఆతురతతో ప్రవేశించి) ఇంకా చూస్తారేం రా! డిండిమం మ్రోగించండి. ఒరేయ్ చారుదత్తా! తాటిపట్టి వంటి నీ నాలుకతో ఇప్పటికైనా సరే దేవుని ఎదుట ఒక్కమాటు వసంతసేనను చంపానని ఒప్పుకో. నీకు శిక్ష తగ్గే మార్గం ఆలోచిస్తాను. చారుదత్తుడు : శిక్ష తగ్గుతుందని చేయని పని చేశానని ఎలా అంగీకరించేది? శకారుడు : నీమీద కనికరం కలిగింది. శిక్ష తగ్గిద్దామని ఉద్దేశిస్తున్నా, లేకపోతే శూలారోహణమే రాజాజ్ఞ. చారుదత్తుడు : దావానలంవంటి ఆపదలో దహనమై పోతున్నానని భయంలేదు. కానీ - లోకంలో నన్నంతగా ప్రేమించిన వసంతసేనను ప్రణయినిని ధనలోభంతో చంపాననే అపకీర్తి వ్యాపిస్తుంది కాబోలు. శరీరం కంపిస్తున్నది. కంపించి ఏం ప్రయోజనం? కర్తవ్యం? శకారుడు : (నిష్కర్షగా) చంపానని ఒప్పుకోటం? చారుదత్తుడు : అవును. నిజమే చంపానని ఒప్పుకోవటమే. లోకం దృష్టిలో చంపినట్లు స్థిరమైపోవటం నిశ్చయమైపోతున్న తరువాత అంగీకరించటానికి నాకు అభ్యంతరమెందుకు? వసంతసేన 203