Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(ముద్దు పెట్టుకోనాయనా అని ముద్దు పెట్టించుకుంటాడు) మైత్రేయా! నాయనా! నీవు మామ వెంట ఇంటికి వెళ్లు. అత్త మీకోసం దిగులు పడుతుంది. (గోహ శోధనకులతో) ఇక మీదే ఆలస్యం. శకారుడు : (ప్రవేశించి) ఒరే ఏమిటిరా ఈ ఆలస్యము. అడుగులో అడుగు వేసుకుంటూ అబ్బ చచ్చినట్లు (రోహసేనుణ్ణి తోసివేస్తూ) పద, అవతలికి. మీ మైత్రేయుడు : (ఎత్తుకొని) నాన్నగారికి నమస్కారం చెయ్యి నాయనా! చారుదత్తుడు : (రోహసేనుడు నమస్కరిస్తే దీవిస్తాడు). శకారుడు : ఒరేయ్, నేను వచ్చేటప్పటికల్లా అంతా పూర్తి చేయించండి. నా కంటిముందు పని జరగాలి. ఆఁ జాగ్రత్త. (నిష్క్రమిస్తాడు). శోధనకుడు : నడు, బాబూ! నడు. ఈ దుర్మార్గుడు ఏమైనా మా ప్రాణాలకు ముప్పు తెస్తాడు. గోహ : ఓ దొరా! ఈ అయ్య దుండగం బలేమో పైంది. చారుదత్తుడు : (నిట్టూర్పుతో) రామప్రభూ! రామప్రభో!! (శోధనకుడూ, గోహాలు నడిపిస్తుంటే చారుదత్తుడు వెంట నడుస్తాడు.). (తెర) 202 వావిలాల సోమయాజులు సాహిత్యం-2