Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చారుదత్తుడు : (వెనకకు తిరి) మైత్రేయా... రోహసేనా!! (మైత్రేయుడు రోహసేనుడు ప్రవేశిస్తారు) మైత్రేయుడు : (కన్నీళ్ళతో) చారుదత్తా! చారుదత్తుడు : మైత్రేయా! మైత్రేయా!! దుఃఖించి ప్రయోజనం? మనం దరిద్రులం. దరిద్రుల కిది కాని కాలం. ధనవంతుడెంత అభాజనుడైనా తల ఒగ్గిపోవటమే మనధర్మం. లేకపోతే - ధనంతో ఎంతపనైనా చేయగలుగుతాడు. నాయనా! రోహసేనా! (దగ్గిరకు తీసుకొని) మైత్రేయుడు మామయ్యే నీకు సమస్తమూ. అమ్మ చెప్పినట్లు విను పెరిగి పెద్దవాడవై నీ తాతముత్తాతల పేరు నిలవబెట్టు నాయనా. ఇదిగో! (మెడలో జందెము తీసి) తండ్రీ! (*) ఇది తుదకీ నీకీయటానికి దక్కింది. సంతోషించు. బ్రాహ్మణ బిడ్డవైన నీకిదే నగ. ఇది స్వర్ణహారం కాదు ముప్పేటలు ముత్తెపుసరం అంతకంటే కాదు. కానీ నీ తాతలు, తండ్రులు, దేవతలు దీనివల్లనే తృప్తు లౌతారు. రోహసేనుడు : నీవు ఎక్కడికి నాన్నా! చారుదత్తుడు : ఒక అభం శుభం ఎరుగవుగదా తండ్రీ! ఎక్కడికి వెళుతున్నానో చెప్పమన్నావా? తండ్రీ! (*) మాసిన కీర్తితో, దయమాలిన శూలంతో, కంఠాన ఈ భాసుర రక్తమాలికతో, దుఃఖాగ్నితో, పరేత భస్మసింహాసనాన్ని అధిష్ఠించి, ఆ యముడు ఏలుకునే యజ్ఞవాటికకు. గోహ : ఓ సిన్నదొర! రాజుగారి ఆజ్ఞ స్మొశానానికి. శోధనకుడు : మీ నాన్నగారిని చంపటానికి తీసుకొనిపోతున్నాము. రోహసేనుడు : అబ్బీ - మా నాన్నగారిని ఒదిలిపెట్టి నన్ను తీసుకోపోండి. నేను వస్తాను. చారుదత్తుడు నాయనా! రోహసేనా!! ఇటురా తండ్రీ! (దగ్గిరికి తీసుకొని) ప్రేమామృతనిష్యందివంటి నీ మాటలు నా హృదయసాగర గర్భాన్ని కలిచేస్తున్నవి తండ్రీ!- (*) నీకు వేయేండ్ల ఆయువు కలుగుగాక! ఏది నాన్నా! ఇలారా! (కౌగిలించుకొని) ఈ దరిద్ర దేహానికి నీ కౌగిలి చందనలేప మైందోయ్. తండ్రీ! దీనికి ఏ ఔశీనరచర్చ కూడా తుల్యం కాలేదు. వసంతసేన 201