వ్యాపారం సాగించాను. అది నడిసముద్రములో అనుకోని కొండరాయికి కొట్టుకొని బ్రద్దలైపోతున్నది. అందులో మునిగిపోతూ ఉన్న నన్ను కనికరించి మటుకు మహానావికులు కాని మీరేం చేస్తారు? చింతించకండి. “యదన్హాత్ కురుతేపాపం తదన్హాత్ ప్రతిముచ్యతే” నామీది ప్రేమ నాచిట్టితండ్రి రోహసేనుడిమీద చూపించండి. మీ జీవితాలల్లో పవిత్రప్రేమకు భంగం కలిగించకండి (నమస్కరిస్తూ) ఇక తాము నాకు సెలవిప్పించండి. (జనం కదలరు) వెళ్ళరా! రాజాజ్ఞను వ్యతిక్రమించి అరాజకం చెయ్యటానికి పూనుకోకండి. ఆ అపకీర్తి నా కంట గట్టకండి. సెలవు. (జనం కదిలి మూకలు మూకలుగా వెళ్ళిపోయే కోలాహలం వినిపిస్తుంది) గోహ : (శోధనకుడితో) దొరా! చారుదత్తయ్య బలే దొడ్డ అయ్యగదూ! ఆయన మాటంటే సూసినన్ దొరా! మంది గొర్రెల మందలాగా టుర్రో అంటే టుర్రో. శోధనకుడు : శకారయ్య వస్తాడేమోరా! - త్వరగా నడిపించు. కొంచెం తొందరపెట్టు. గోహ : ఆయన ఇట్ట మొచ్చినంతసేపు నడవనీ దొరా! అయ్య పోదామంటే పోదాం, ఆగమంటే ఆగుదాం. బంగారమంటి అయ్య మళ్ళీ సూద్దామంటే మనకంటికి మాత్రం కనబడతాడా! చారుదత్తుడు : (భ్రాంతితో) మదనికా! మదనికా! మరణసమయంలో మా వసంతసేన చారుదత్తుడి మనస్సులో ఉందో లేదో అని పరీక్ష చేయటానికి వచ్చావా? మనస్సులోనే కాదు. నాలోవున్న ప్రత్యణువులో మనసిజశిల్పి చిత్రించిన ద్వందాతీత మనోజ్ఞమూర్తి, ఆ అమృతమూర్తి స్థిరంగా ఉంది సుస్థిరంగా ఉంది. మదనికా! నేను మాత్రం నిర్భాగ్యుణ్ణి, ప్రియా, వసంతసేనా! (*) లేకపోతే ఆనంద రసకుంభవృష్ణులు కురిసి నా హృదయక్షేత్రాన్ని సంతోషపెట్టటానికని నీవు రానే వచ్చినప్పుడు ఈ నూతనాకృతితో నన్ను భస్మీభూతుణ్ణి చేయటానికి ఈ మహాప్రళయం వస్తుందా! (ఒక్కమాటు దీర్ఘ నిశ్వాసం చేసి గోహా, శోధనకులను చూచి) నాయన లారా! ఏదో భ్రాంతిలో పడ్డాను. మీ ఉద్యోగ ధర్మాలకు ఆలశ్యం చేశాను. క్షమించండి. ఇక నడవండి. గోహ : చిత్తం దొరా? (రెండడుగులు వేయగానే నాన్నా, చారుదత్తా, నాన్నా, చారుదత్తా అని మైత్రేయ, రోహసేనుల రోదన కంఠాలు వినిపిస్తవి). 200 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/200
Appearance