Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శకారయ్య ఇద్దానవనంలో దుడ్డుకాసపడి పీక నులిమేసి సంపిండు. సొమ్ముతో దొరికిండు. నేరం ఒప్పుకుండాడు. దొరగోరు చాత్రపైకా రంగా ఈయన గోరికి సూలమెక్కించమని సెలవిచ్చిండు. ఈ తప్పుకు నోరికైనా యిదే చాత్తి. తెలుసుకోండొహో, తెలుసుకోండి. చారుదత్తుడు : చారుదత్తా! చారుదత్తా!! నీవెంత పరమ దౌర్భాగ్యుడివి. వేదఘోషలతో వివిధ పవిత్ర క్రతువులతో వన్నెకెక్కిన నీపరిపూతవంశానికి తీరనికళంకం తెచ్చి పెట్టావు. ప్రపితామహా, వినయదత్తా! - పితామహ, యజనదత్తా! - ఈ బ్రాహ్మణ బ్రువుడివల్ల మీ పుణ్యనామావళి ఈ ఘోషణ స్థానంలో ఈ రీతిగా వీరినోట పడవలసి వచ్చింది. మ్మీ లోకాలల్లో మీ దీర్ఘతపస్సులకు ఈ నికృష్ట దుర్ఘటనలతో ఈ నీచుడు ఎంత అంతరాయం కల్పించాడు. శపించండి! మీ శాపోదకం వల్లనైనా వీడికి ఏ జన్మలోనో శాంతి కలుగుతుంది. శపించండి!! శోధనకుడు: ఓరే గోహిగా! ఇంకా ఈ జనాన్ని ఎంతదూరం రానిస్తావురా? పంపించెయ్! అయ్యా మీరంతా ఇక యెంటరాకూడదు. వెళ్ళిపొండి. గోహ : ఓ దొరల్లారో! (నమస్కరిస్తూ) పొండి. పొండి. కదలరేం. శోధనకుడు : ఆఁ. కదలరేం (గోహాతో) ఎంతచెప్పినా కదలరేంరా? గోహిగా రక్షకభటులను రప్పిద్దామా ఏం? గోహ : ఏం చేసేది దొరా? సావమన్నావా, ఏమిటి? పీక సినిగేట్లు ఎంత కొట్టుకున్నా పోకపోతే - మన ఎంటనే మంది శూలందాకా ఒచ్చారో (చారుదత్తుణ్ణి చూపిస్తూ) ఆ అయ్య సావెట్లున్నా మన సావు మూడిందే శకారయ్య సేతుల్లో. శోధనకుడు : ఆలస్యమైతే మన కొంపమీదికి వస్తుంది. గోహ : (చారుదత్తుణ్ణి చూపిస్తూ) అయ్యగారు చెప్పే ముక్కలు రెండూ సెపితే మంది ఎనక్కు పోతుంది దొరా? ఆయన్ను బతిమాలుకుందాం (చారుదత్తుడి దగ్గరకు పోయి) పెబో! మా పాణాలు దక్కించు. మా పెళ్ళాల తాడు తెగుద్ది. మందిని పంపించెయ్ దొరా! (చారుదత్తుడు రెండడుగులు వెనక్కు వేయగానే) దండాలు దొరా? దయగల అయ్యదొరా! చారుదత్తుడు : (ప్రజలతో) అన్నలారా! నా దురదృష్టానికి మీరేం చేస్తారు? ఇది ఈ జన్మలో చేసుకొన్న పాపం కాదు. పురాకృతం. నా జీవితనావతో సౌఖ్యసముద్రాలలో వసంతసేన 199