Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదిహేనో దృశ్యం చారుదత్తుడు : ఏ అన్నెపున్నె మెరుగని నావంటివానికిదేనా నీవు విధించవలసిన శిక్ష! విధీ! నీకు హృదయం లేదు. నీది గుండెకాదు. కఠిన కర్కశ గండోపలము. ఆగర్భ శ్రీమంతుని ఇంట అనన్యభోగాలనుభవించిన ఓ శరీరమా, నీకెంత దుస్థితి సంప్రాప్తమైంది! ఈ రక్తగంధానులేపనంతో ధరాపరాగధూసరితమై... శోధనకుడు : ఓరి గోహిగా! అటు చూడసే. ఆ జనాన్ని చూడు. అయ్యగారిని ఎలా శూలం మీదికి ఎక్కిస్తావో! గోహ : ఏమో దొర. ఈ మందిలో గగ్గోలు చూస్తే నాకు చేతులు వొడికిపోతున్నవి దొరా! శోధనకుడు : ఒరేయ్! ఒకమారు తలపైకెత్తి చూడు. మేడలమీద ఆడంగులు అయ్యగారిని ఎలా చూస్తున్నారో చూడు. చారుదత్తుడు : (తలపైకెత్తి) కనిపడేసిన నాలుగోనాడే నా కన్నతల్లి కాటికిచేరినా కన్నబిడ్డల్లా నన్ను చూచుకున్న ఓ ఉజ్జయినీ జనకుల్లారా! మీ ముద్దుబిడ్డ ఇక మీకుండడు. మీ చారుదత్తుడు మీకు లేడు. చింతించి ప్రయోజనం లేదు. మీ కన్నీరు కడళ్ళై కెరటాల బరువులతో పరువెత్తినా, లోకాలు ముంచెత్తినా మీ బిడ్డను బ్రతికించుకోలేరు. యంయం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కళేబరమ్ తంతమేవైతి కౌంతేయా! సదా తద్భావ భావితః శోధనకుడు: గోహిగా, చారుదత్తయ్యను అక్కడ ఆగమను. ఇది ఘోషణస్థానం. ప్రజలందరికి ఒకమాటు అపచారమూ, శిక్షా రెంటిని గురించి చెప్పు. గోహ : (తప్పెట మోగిస్తూ) ఓ అయ్యోయ్! ఇనండి. ఇనండి! ఈ చారుదత్తయ్య ఇనయదత్తయ్య మనుమడు, సాగరదత్తయ్య కొడుకు - ఇనండి. సాని ఇసంతశేనను 198 వావిలాల సోమయాజులు సాహిత్యం-2