ఈ పుటను అచ్చుదిద్దలేదు
చారుదత్తుడు : దోషమేమిటో ఎరుగని వంశంలో పుట్టాను. మీరు నిశ్చయించుకున్న తరువాత పరమాత్ముని దృష్టిలో నేను దోషిని కాకపోయినా లోకదృష్ట్యా దోషినే ఇన్ని మాటలెందుకు కాని (*) పరము ఒకటున్నదనే భయభావం లేకుండా పాపబుద్ధినై తరుణిని, దర్పకుని జన్మభూమిని, రతికైనా వందనం చేయదగినదాన్ని... నేను... అబ్బా... ఏవిధంగా చెప్పగలను? శకారుడు : ఏమున్నది చెప్పటానికి - "చంపాను" - ఈమాట నీవు కూడా ఒక్కమాటు నీ నోటితో చెప్పు. చారుదత్తుడు : (మాట్లాడడు). అధికరణకుడు : చారుదత్తయ్య దోషి అని నిరూపిత మౌతున్నది కాబట్టి - శకారుడు : కొరత వేయటమే శాస్త్రసమ్మతమైన శిక్ష. అధికరణకులు : రాష్ట్రీయులు చెప్పినదే శిక్ష. శకారుడు : ఓరి గోహా! (ప్రవేశించిన తరువాత) వధ్యస్థానానికి నడిపించాలి. (ఒక భటుడు ప్రవేశించి నమస్కారం చేస్తాడు. చారుదత్తుని చేతికి గొలుసులు బిగించి నడిపిస్తారు). (తెర) వసంతసేన 197