చారుదత్తుడు : నా విధి! (శకారుణ్ణి చూపిస్తూ) ఇతడు ఉపాదానకారణం. మైత్రేయా (చెవిలో ఏదో చెపుతాడు). మైత్రేయుడు : ఓరి బ్రహ్మిష్ణో బ్రహ్మిష్ఠి! చారుదత్తుడిమీద నిందారోపణ చేసి న్యాయస్థానానికి రప్పించావట్రా? ఎన్నడైనా అతడు ఇలా వచ్చాడా? కులట లిచ్చిన సొమ్ములు పెట్టుకొని కులికే కోతీ! ఏమన్నావో నాముందు చెప్పు నీ బుద్ధిలా కుటిలంగా ఉన్న ఇదిగో (చూపిస్తూ) ఈ కర్రతో - శకారుడు : ఆయ్! - వ్యవహారం నాకూ చారుదత్తయ్యకూ మధ్య నీవెవడివిరా, బ్రాహ్మణార్థాలు చేసి బ్రతికే బడుగా! పిండాలు పీక్కోతినే పీనుగా!! మైత్రేయుడు : ఏదీ ఆ మాట మళ్ళీ అను. పాదరక్షాప్రహారాలు - (చెయ్యి ఎత్తగానే చంకలో నగలు నేలమీద పడతవి) శకారుడు : అవిగో - మా వసంతసేన నగలు. ఈ పాపిష్ఠిసొమ్ము కోసమే (చారుదత్తుణ్ణి చూపిస్తూ) ఈ పాతకి దాని గొంతు పిసికి పారేశాడు! మైత్రేయుడు : ఆఁ - ఆఁ అన్యాయం. చారుదత్తా, సత్యమేమిటో ఎందుకు బయటపెట్టవు? చారుదత్తుడు : మైత్రేయా! సత్యాసత్యలు ఈ అధికరణకులూ, ఈ రాజులూ పరిశీలించలేరు నా జీవితసర్వస్వం అయిన వసంతసేన లేని తరువాత నేను మాత్రం జీవించటమెందుకు? మైత్రేయుడు : అదేమి మాట! రోహసేనుణ్ణి ఏం చేశావు. అధికరణకుడు : (మదనికతో మైత్రేయుడి ఒంటినుండి జారిన నగలు చూపిస్తూ) అమ్మాయీ! ఈ నగలు మీ అక్కనౌనో కాదో పరిశీలించి చెప్పు. మదనిక : ఆ నగలవంటివే కాని, అవి కావు. మైత్రేయుడు : రెంటినీ చేసిన వాడు ఒకడై ఉంటాడు. అధికరణకుడు చారుదత్తయ్య దోషి అని నిశ్చయించటానికి ప్రబల నిదర్శనం కనబడుతున్నది. 196 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/196
Appearance