Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదమూడో దృశ్యం (న్యాయశాస్త్రానికి వెళ్ళే రాచబాట కూడలి) మైత్రేయుడు : అమ్మాయీ! ఎక్కడనుంచి? రదనిక : (చేతిలో పూలబుట్ట చూపిస్తూ) అక్కగారి పూజకు పూలు తీసుకొని వస్తున్నాను. మైత్రేయుడు : చారుదత్తుడు ఇంటికి వచ్చాడా? రదనిక : నేను బయలుదేరే వరకూ రాలేదు. మైత్రేయుడు : నేనూ ఉదయం నుంచీ ఈ వీథినే కాచుకొని కూర్చున్నాను. దాని ఇంటికి కూడా చేరలేదు. రాత్రి రాలేదు. ఉదయం రాలేదు ఎక్కడికి పోయి ఉంటాడబ్బా? పోనీ, వర్ధమానకుడైనా వచ్చాడా? రదనిక : రాలేదు. మైత్రేయుడు : (యోచించి పెదిమె కొరికి) ఆ బులిబుచ్చి కాలబూచి అందంగా దొండపండులా ఉన్నాడని ఏ మందో పెట్టి ఇతగాణ్ణి ఏ ఊరో లేవదీసుకోపోలేదు కదా? రదనిక : వసంతసేనేనా? మైత్రేయుడు : (కోపంతో) ఆఁ, ఆ వసంతసేనే! రదనిక : ఈ ఊళ్లో ఉంటేమటుకు ఆమె అనురాగానికి ఎవరు అడ్డువస్తారని. అయినా ఆమె చారుదత్తులవారిని ప్రేమించిన విషయం లోకవిఖ్యాతం అయిపోయింది కూడాను. అందుకనే మన రోహసేనుడికి బంగారుబండి చేయించుకోమని హారాలు కూడా ఇచ్చింది. 188 వావిలాల సోమయాజులు సాహిత్యం-2