Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మైత్రేయుడు : ఇచ్చింది. చారుదత్తుడు ఎలాగూ ఉంచుకోడని తెలిసి యిచ్చింది. అతగాణ్ణి మనకు లేకుండా చేయటానికి లంచం పోసింది. లేకపోతే చారుదత్తుడేమైనట్లు? వర్ధమానకు డేమైనట్లు? బండేమైనట్లు? ఎడ్లేమైనట్లు? రదనిక : బాబయ్యా! ఇందాక నేను పూలకు వెళ్ళుతుండగా బండి ఎక్కి ఆర్యకుడు తప్పించుకోపోయినాడనీ అతణ్ణి పట్టి యిచ్చినవాళ్లకి నాల్గువందల వరహాలు బహుమానమనీ దండోరా వినిపించింది. మైత్రేయుడు : అయితే - రదనిక : మన వర్ధమానుడే ఆర్యకుణ్ణి బండిలో ఎక్కించుకొని ఒప్పించటానికి వెళ్ళి ఉంటాడు. మైత్రేయుడు : ఓసి వెర్రిదానా! అయితే మన చారుదత్తుడేడి మరి? రదనిక : వారూ ఆర్యకుడికి సాయం చెయ్యటానికి వెళ్ళి ఉంటారు. మైత్రేయుడు : ఆ నెత్తిమీది కులదేవత వసంతసేనతో కూడానేనా? రదనిక : ఆమె ఇంటికి వచ్చి ఉంటుంది. మైత్రేయుడు : ఇందాకటివరకూ అది కొంపకు చేరుకోలేదు. ఇదుగో మళ్ళీ వెళ్ళుతున్నాను. ఇందాక నీవన్న నగలు చేయించుకోమని ఇచ్చినవి - - రోహసేనుడికి బంగారుబండి దానికి వెంటనే చేర్చమని వెళ్లేటప్పుడు నాకో పని కూడా పెట్టి వెళ్ళాడు. ఎన్ని తడవలని పోయేది, ఆ పాడుకొంపకు. ఇందాకనే దాని తల్లి మండిపడ్డది. రదనిక : ఎందుకని? మైత్రేయుడు : ఎందుకనేమిటి? మన ఖర్మం బాగుండలేదని. చారుదత్తుడే దాని పిల్లను చెడగొట్టాడట, చెప్పుచ్చుకొని నాలుగుపళ్లు రాలగొట్టేవాళ్లు లేక - నాలుగు డబ్బులు సంపాదించుకోకుండా నలుగురు బంధువుల నోట్లో దాన్ని నగుబాట్లు చేస్తున్నాడట! వసంతసేనకు శకారయ్యంటే గిట్టకుండా చేసిందా చారుదత్తుడేనట! రదనిక : చాలు! చాలు!! - మైత్రేయుడు : ఒక మాటా! ఒక పలుకా! అప్రాచ్యపు ముండ ఇంతకూ మన బంగారం మంచిదయితే కంసాలి ఏమి చేస్తాడు? వసంతసేన 189