ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మదనిక: అక్కా అటుచూడు! (మేఘగర్జ) మేఘగర్జ విన్న తరువాత కూడా నీకు ధైర్యం సడలటం లేదా?
వసంతసేన : (ఆకాశంవైపు దృష్టి నిల్పి) (*) ప్రభూ! పర్జన్యా!! నేను ప్రౌఢజ్వల వేషంతో నా ప్రియుని ఇంటికి బయలుదేరుతుంటే ఈ ప్రావృట్కాల ఘనఘోషలతో, ద్రోణవృష్ణులు కురియ తలపెట్టావు. ఈ దౌష్ట్యం నీబోటివాని కర్షమైందేనా?
మదనిక : అక్కా! అతడేమి చేస్తాడు? మేఘాధిపతి ఇంద్రమహారాజుకు నీమీద దయ తప్పింది.
వసంతసేన : ఇంద్ర మహారాజుకు దయతప్పనీ, చంద్రమహారాజుకు దయ తప్పనీ - ముల్లోకాలూ ప్రళయకల్లోలాబ్దిలో మునిగిపోనీ - అదుగో! ఆ మెరుపుకన్నె అలా దారి చూపుతూ వెలిగితే చాలు!! (ఔత్సుక్యంతో)
(*) అమ్మా, సౌదామినీ!! ఆ మేఘరాజును అలాగే ఉరమనీ. అతడు మగవాడు. హృదయేశ్వరునికోసం విరహార్తనైన నేను అభిసారికనౌతున్నాను. నన్ను ఏవిధంగా ప్రియుని ఇంటికి చేరుస్తావో!
(నిష్క్రమిస్తుంది)
——————————————————————————
వసంతసేన
167