Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదో దృశ్యం

[చారుదత్తుని ఇల్లు - ఆషాఢ మేఘగర్జనలూ మెరుపులూ - సాయం సమయం మధ్య మధ్యన ఆలోచించుకుంటూ అతడు కవితాగానం చేస్తూ మధ్య మధ్య తాళపత్ర గ్రంథం మీద లిఖిస్తూ ఉంటాడు]

చారుదత్తుడు :

"సకియ యేతెంచు నేమొ, ఆషాఢజలద!
బిట్టు గర్జించి యిటు భయపెట్టకయ్య:
తిమిరముల జీల్చి భవదీయ దేహకాంతి
తోడుపడ గదె, తల్లి, విద్యుల్లతాంగి!
ఆగు మొక్కింత జలదుడా! ఆగవోయి :
రామగిర్యాశ్రమోపాంత రమ్యభూమి
సకియ నెడబాసి నాడు వేసారు యక్షు
దూతవే నీవు చెప్పుమా తొలుత సఖుడ?
ఇతని నీ గతి ఘోషింపనిమ్ము శంప!
అటులె కాయించి వెన్నెల నమృతరూపి
దెసల వెలిగింప హృదయాధిదేవి వచ్చు
వచ్చు దుర్దినమైన నే ప్రళయమైన”

మైత్రేయుడు : (ప్రవేశిస్తూ విసిగిపోయినట్లుగా) ఛీ, ఛీ, ఛీ! బులిబుచ్చి కాలబూచి గాయత్రిసాక్షిగా దానిమొఘం మళ్ళీ చూడకు. చదువుకున్న బ్రాహ్మణ్ణని చాప వేసిందా? పోనీ వట్టినేలమీదైనా గట్టిగా కూర్చోమందా? సుడి పడిపోయి దాని కొంపకు చేరుకుంటే కాస్త శుద్ధి చేసి గుక్కెడు మంచినీళ్ళిచ్చిందా? పచ్చి పుండాకోర్!! అరెరె! వెళ్ళింది మొదలు రెండో ప్రసంగమే లేదాయె! కాకులకు కోకిలలెలా పుడతాయి ఉ హుఁ హు. - 'విత్తమాత్రోపాధే సకల పురుషాభిలాషిణీ సామాన్యా!!

————————————————————————

168

వావిలాల సోమయాజులు సాహిత్యం-2