ఈ పుటను అచ్చుదిద్దలేదు
శకారుడు : (తల వంచుకొని నేలచూస్తూ) పోయి వాడిని పట్టుకుందాం? కుంభీలకుడు : చిక్కుతాడనేవాడు నీకు. మంచి ఘనమైన 'శఠగోపురం' పెట్టాడు బావా! ఆ జూదగాడి చేతిలో పెట్టిన హారం జువ్విచెట్టుక్రింద ఈపాటికే అయిపోయి ఉంటుంది. శకారుడు : (బిక్కమొగంతో) అంగడికి పోతే దొరుకుతాడేమో! కుంభీలకుడు : వాడు అంత అథమస్థు డనుకున్నావా? - ఇవాళ ఇంతకూ నిద్రలేచిన ముహూర్తం మంచిది కాదు. ఒక్కపూట ఊళ్లో లేకపోతే ఎంత ఉప్పెన తెచ్చుకున్నావు - (ఆలోచించి) - అయినా మొన్న మనం ఆట ఆడిన చోట వాడు ఇప్పుడు ఉంటే ఉండవచ్చు - పద! శకారుడు : అయితే, మరి రాత్రి నాటకమో! కుంభీలకుడు : ఇంకా ఏం నాటకం? బూటకం. ఉఁ పద. వెతుకుదాం. (ఇద్దరూ నిష్క్రమిస్తారు) వసంతసేన 157