కుంభీలకుడు : (కొంటెగా) ఆఁ ఎక్కడ? శకారుడు : ఎక్కడేమిటి? దాని దగ్గరనే - కుంభీలకుడు : దాని దగ్గరనే - ఓసి ముండా! - అంత ఎత్తు ఎత్తితేగాని ఒప్పుకోలేదేం? శకారుడు : నేను కృష్ణయ్యైతే అది ఆగలేదట! - కుంభీలకుడు : (ఛలోక్తిగా) లేకపోతే మరి నువ్వు సామాన్యుడివా? నీ ధాటీలకు అది ఆగవద్దు - మరి చివరకు ఒప్పుకుందా? శకారుడు : చచ్చినట్టు. కుంభీలకుడు : (నెమ్మది నెమ్మదిగా) అయితే, రేపు భామ వేషం వేసేది... శకారుడు : వసంతసేనే? కుంభీలకుడు : (నిర్ఘాంతపోయినట్లు) వసంతసేన! శకారుడు : మరి మనదెబ్బంటే ఏమనుకున్నావు? కుంభీలకుడు : నేను నీ మాట నమ్మను - నిజం చెప్పు. శకారుడు : నువ్వూ నేనూ బతికి ఉన్నంత నిజం బావా? మరి నిన్న నా మెళ్లో ఉన్న హారమేమైందనుకున్నావ్? కుంభీలకుడు : (ఆలోచిస్తూ) నీవు స్వయంగా ఆమెతో... శకారుడు : ఆ లోతులన్నీ నీకెందుకోయ్! ఏదో మేము చేసుకున్నాం. రేపు భామ వేషానికి వసంతసేన గజ్జకట్టకపోతే అప్పుడడుగు! కుంభీలకుడు : ఇంతకూ నీవు మాట్లాడలేదన్నమాట! - అయితే నిన్ను ఎవరో మోసగించారు. శకారుడు : (తానూ ఆలోచనలోపడి) ఆఁ మోసమే! - కుంభీలకుడు : హారం ఎవరికిచ్చావో చెప్పు - ఏం జరిగేది నే చెపుతాను. శకారుడు : మాధురుడు మన్నే మోసగిస్తాడా? కుంభీలకుడు : బలే, ప్రబుద్ధుడివి! చాలా గొప్పవాడికిచ్చావు. అయ్యా! తూర్పు తిరిగి దణ్ణం పెట్టు. 156 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/156
Appearance