Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శకారుడు : (ఏదో గొప్ప రహస్యం దాచిపెడుతున్నట్లుగా) ఓస్, ఇదివరకు చెప్పేశాం, ఇప్పుడు చేస్తున్నాం, ఇక చేస్తాం.

కుంభీలకుడు అహఁహాఁ! మీకేమండీ, రసికాగ్రేసర చక్రవర్తులు మహాప్రభో! - అయితే నాకుకూడా - శకారుడు : ఉష్ - నీకూ లేదు, నిన్ను పుట్టించినవాడికీ లేదు. కుంభీలకుడు : పోనీలే, చెప్పవన్నమాట! (నడుస్తూ) మన స్నేహితం చెల్లు (వెళ్ళబోతాడు) శకారుడు : (పిలుస్తూ) బావా! గమ్మత్తుచేస్తుంటే అప్పుడే కోపమా! కుంభీలకుడు : (దగ్గిరకు వచ్చి) అయితే చెప్పు. శకారుడు : చెపితే? కుంభీలకుడు : మన యిద్దరం మళ్లీ బావా, బావా! శకారుడు : అయితే నీవన్నదే బావా! కుంభీలకుడు : నీవన్నదే అంటే? శకారుడు : మళ్ళీ భాగోతం? కుంభీలకుడు : భాగోతమే! - ఎప్పుడు? శకారుడు : ఈ రాత్రికి. కుంభీలకుడు : ఎక్కడ? శకారుడు : ఎక్కడో ఎందుకు బావా! మనకేం భయం, మనకోటలోనే. కుంభీలకుడు : మనకోటలోనే! అదా ఇందాకటి ఊసంతా? - అదే అదే జట్టా! శకారుడు : ఆఁ మనజట్టే! - గోపికా వస్త్రాపహరణం. కుంభీలకుడు : వస్త్రాపహరణమే! - తరువాతో, మహారాజుగారికి రాత్రికి నిండా పని తగిలింది - అదృష్టవంతుడివి బావా! - కలిసివస్తే ఇలా రావాలి, లేకపోతే శకారుడు : బావా! పోయినరాత్రి ఎంత ఎత్తైత్తా ననుకున్నావేం? - వసంతసేన 155