Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదో దృశ్యం


[శకారుడు ఏకాంతంగా యక్షగాన నాటకంలో వేషం వేయటానికి శబ్దం చేసుకుంటుంటాడు.]


తరి తరి ధిమి తరి తత్తరి కిట తక
తధీం ధిమ్తరీ తక ధిమి ధిమి ధిమి
పొన్న మ్రాకుపై వెన్నదొంగనై
కన్నె గోపికల వన్నె చీరెలను
తకధిక తధిగిణ తోం
విడిచి నీటిలో పడినవేళలో
ముడిచిచేతిలో నడతు నీడలో
త్రిజమ్త కిట - దివ్యసుందరీ
ధాకిట్త కిట - భవ్యదేహముల
మునిజనపాలా! మురళీలోలా!!
అగధర కిట్తకిట - అమరవందితా
తక్కిట ధరి తక, ధరి కిట్త కిట్త ధిమి
త్రిజమ్త ధకి తక తరుంధ ధిమి కిట్త


(ప్రవేశము విటుడు - ఒళ్ళు తెలియకుండా శకారుడు శబ్దబ్రహ్మలో లీనమై పోతుంటాడు)

కుంభీలకుడు : (నవ్వుతూ) బావా! ఏమిటీ కొలుపు?

శకారుడు : ఆఁయ్ - జాగ్రత్తగా మాట్లాడు! కొలుపూ?

కుంభీలకుడు : పోనీ కొలువు కాకపోతే భాగోతం!

శకారుడు : ఉం- అలారా దారికి

కుంభీలకుడు : బావా! వాలకం చూడబోతే మహారాజువు. ఏదో చేసివచ్చినట్లున్నావే!


154

వావిలాల సోమయాజులు సాహిత్యం-2