Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శర్విలకుడు : (బుజాలమీద చేయి వేసి మదనికను ముందుకు తెస్తే ఇరువురూ వసంతసేనకు నమస్కరిస్తారు) వసంతసేన : అమ్మాయీ! నేను లోపలికి వెళ్ళి శర్విలకులు మన ఇంట్లోనే విందు చేస్తారని చెప్పి వస్తాను. మదనిక : (ముగ్ధంగా ఊరుకుంటుంది). శర్విలకుడు : మదనికా! ఏదీ ఆనాటి వెన్నెలరాత్రి - ఉద్యానవనంలో నీవు నన్ను ప్రశ్నించినపాట! మదనిక : (ఆనందంతో) ఎన్నటికో! ఎన్నటికో!! స్వేచ్ఛా విహరణ మిథున విహంగమ జీవన మధురిమ ఎన్నటికో - ఎన్నటికో విరులతోట విపణివీథి ॥ ఎన్నటికో... ॥ వెన్నెలలో వేసగిలో, ఎన్నటికో! ఎన్నటికో!! శర్విలకుడు : (ఆమె కంఠస్థాయిని మించి) ఈనాటికి నేటి కహో! నీ నా బ్రతుకొక టైనది పదముననే పదమిడుమా పదవే పద పదవే - నీ యెదయే నా యెదగా నా యెదయే నీ యెదగా అవధిలేని ప్రణయావని ఆవలిదెస చేరుదమే - ॥ ఈనాటికి... || ॥ ఈనాటికి... ॥ (ఇరువురూ పాటతో నిష్క్రమిస్తారు) వసంతసేన 153