శర్వీలకుడు : (మదనికవైపు చూస్తాడు) మదనిక : (నిశ్చలంగా నిలుచుంటుంది) వసంతసేన : మదనికా! ఇలారా! మదనిక : (వసంతసేన దగ్గరకు వస్తుంది) వసంతసేన : (చిత్రపటం దగ్గిర ఉన్న - పూలహారాలు రెండు తెచ్చి ఒకటి మదనికకు మరొకటి శర్విలకుడి చేతికిస్తుంది) శర్విలకుడు : మీరు ఏమి చేయబోతున్నారో మాకేమీ బోధపడటం లేదు. ఇప్పుడు మనం ఉన్నది నాటకశాలలో కాదుగద - (గుటక వేసి) అమ్మయ్య! ప్రేక్షకులు ఎవరూ లేరు. బ్రతికాము - (ఇద్దరినీ ఎదురుమళ్ళ నిలువ బెడితే మదనిక హాస్యము మాని వేయమన్నట్లు సంజ్ఞ చేస్తుంది) ఒకరి మొగం ఒకరు చూచుకుంటారు - వసంతసేన : (ఇరువురి మధ్యా నిలబడి శర్విలకుడితో) మీరు వేళాకోళం మానేయాలి. ఆమె నర్తకి, నీవు నటుడవు. శర్విలకా! అమ్మాయీ మదనికా! - మీ ఇందాకటి సంభాషణమంతా నేను సౌధం మీదినుంచి వింటున్నాను. (మదనిక, శర్విలకుడు శర్విలకుడు దొంగతనం పట్టుబడ్డట్లు బిక్కమొగం పెడతాడు) శర్విలకా! మా మదనిక నీ హృదయ సౌశీల్యానికి తగ్గ బహూకృతి. ప్రణయినీదాస్య విముక్తికోసం పరమ సాహసానికి పూనుకున్న ప్రియుడవు నీవు. ప్రియుని పాప పంకిలనుంచి బయటపడవేద్దామన్న పవిత్రాశయం గల ప్రణయిని మా మదనిక! మీ అవ్యాజానురాగానికి సేతువుగా నేను నిలవదలచుకోలేదు. ఈనాటినుంచి మా మదనిక స్వేచ్ఛాజీవి, నా సహోదరి, నీ ప్రేయసి! - అమ్మాయీ! నీవు అదృష్టవతివి, అనుకూలుడైన భర్త అతివలకు పూర్వజన్మ సుకృతం వల్ల కాని మీ ఇరువురూ మాలాలంకరణం లభించడు. చేసుకో మని - - శర్విలకా! ఇదిగో, నీ ప్రియ! - శర్విలకుడు : తల్లీ! నీ ఆజ్ఞ అనుల్లంఘనీయం (మదనిక మెడలో పుష్పహారం వేస్తాడు) మదనిక : (శర్విలకుడి మెళ్ళో హారం వేస్తుంది) శర్విలకుడు : (మధురంగా) మదనికా! మదనిక: శర్విలకా! 152 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/152
Appearance