వసంతసేన : వారింట్లో ఉంటేనేం నా ఇంట్లో ఉంటేనేం? శర్విలకుడు : మీ భావంలో అంతే కావచ్చు. కాని మావాడు ఏ అపకీర్తి నెత్తిమీద పడుతుందోనని చాలా భయపడుతున్నాడు. దాచిపెట్టటం కష్టంగా కూడా ఉందట. మీరే పుచ్చుకొని కాపాడుకోవలసిందని చెప్పి ఇచ్చిరమ్మని పంపించాడు. వసంతసేన : పాపం! వారిని చాలా శ్రమపెట్టాను - క్షమించమని చెప్పండి.
శర్విలకుడు : అయితే మావాడు మీ క్షమాపణ అందుకుండేటంత అవ్యక్తుడు కాదులేండి. (నవ్వుతూ అందించబోతాడు) వసంతసేన : మదనికా! (అందుకొమ్మన్నట్లు సంజ్ఞ) మదనిక: (అందుకుంటుంది) వసంతసేన : (ఏదో జ్ఞప్తికి వచ్చినట్లు) మీ పేరు శర్విలకులే కదూ! శర్విలకుడు : (నవ్వుతూ) అయితే - నేనేం ప్రమాదం చెయ్యలేదుగదా, కొంపతీసి దీర్ఘంగా జ్ఞప్తికి చేసుకుంటున్నారు. - వసంతసేన : (నవ్వుతూ) మీలో ఇంత చమత్కారం ఉండబట్టే చారుదత్తులవారు నన్ను ఒక కోరిక కోరారు. శర్విలకుడు : కోరికా? ఏమని? వసంతసేన : పూర్వం నీ నగలపాత్ర తెచ్చిన మా మిత్రుడెవరైనా బహూకరించమని. శర్విలకుడు : ఏదో 'హాస్యకేసరి' అని ఒక బిరుదు పారేయకండి భరించలేను. వసంతసేన : అంతకంటే గొప్పబిరుదే - మీబోటి యువకులు మోయ లేకపోతే - శర్విలకుడు : (బుజాలు బలం మోయటానికి సిద్ధపడుతూ ఉన్నట్లు పెట్టి) కానీయండి! ఎత్తండి!!! వసంతసేన : ఆటే బరువుకాదు లెండి - మా మదనిక ఏమంత బరువుంటుంది. శర్విలకుడు: మదనిక: (నివ్వెర పోతారు) శర్వీలకుడు : మీరు దేనికైనా సమర్థులు - ఏదో నాటకమాడుతున్నారు. వసంతసేన : నాటకాలు ఆడేవాళ్ల దగ్గిర నాటకాలాడకపోతే ఎలా గనక- వసంతసేన 151