Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొమ్మిదో దృశ్యం [వసంతసేన ఇల్లు - చారుదత్తుని చిత్రపటంవైపు చూస్తూ - మధ్య మధ్య - వాతాయనం (కిటికి) వైపు నడుస్తూ] వసంతసేన : నవవసంత మధుపా! అధిపా. హృదయాధిప!! ఎలదోటకు రాణి ఇది లేబ్రాయపు సుమకన్యక త్రపవీడిన నాపై నీ కృపగల్గునో లేదో, ఓ నవవసంత... ఎదతీవియ కదలించిన పదమల్లెను, విననొల్లవా? యుగయుగాల కిది నీదే వలపో, మరి, వగపో (లోపలనుంచి) శర్వీలకుని గొంతు : మరల మరల నోహో! ఈ మధువసంత మరుదెంచునె? మదనిక గొంతు యౌవ్వనసుఖ మనుభవింప కేలబేల లయ్యెదరు? శర్విలకుడు : పూలతావి తరిగినదా 158 నవవసంత... వావిలాల సోమయాజులు సాహిత్యం-2