Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారుదత్తుడు : నేను ఋణవిముక్తుణ్ణి కావటానికి భిక్షాటనం తప్ప వేరేమార్గం లేదంటావా?

మైత్రేయుడు : మహాబ్రాహ్మణుణ్ణి ఉపనయనం నాటిమాట కంటే ఇంకో మంచిమార్గం ఉన్నదంటానా? - పద, బయలుదేరు. ఏ దేవతా ప్రతిష్ఠ పేరో పెట్టుకొని పెద్దవాళ్ళ లోగిళ్ళన్నీ నువ్వు చూడు. ఎర్రని రాగి చెంబు నున్నగా తోమి ఎక్కిన గడప ఎక్కకుండా ఏడాదిపాటు యాయవారం నేను చేస్తాను. దాని నగలెంత చేసు అదెంత చేసు. ముష్టికి నష్టి లేదన్నారు పెద్దలు - దేవుడు మేలు చేస్తే మళ్ళీ వెనుకటి వ్యాపారం సాగించముటోయ్.

చారుదత్తుడు : విధీ! విధీ!!

(*) ఎందుకీ బ్రాహ్మణవంశంలో జన్మించమని విధించావో! ఎందుకు ధనమిచ్చావో!! ఎందుకు వర్తకుని చేశానో!! తుదకు దరిద్రుణ్ణి చేసి బిక్షాటన చేయమని ఎందుకు కల్పించబోతున్నావో!!

రదనిక : (హారముతో ప్రవేశిస్తూ) బాబయ్యా! అక్కయ్యగారు మీకిది ఇచ్చి రమ్మన్నారు. (చెవిలో ఏదో చెపుతుంది)

మైత్రేయుడు : (చారుదత్తునితో) మొన్న రత్నషష్టివ్రతోద్యాపన చేయించానులే. దక్షిణగామాలి. (చారుదత్తుని దగ్గరకుపోయి) - నేను నిన్న ఒక సంగతి జరిగితే ఒక బ్రాహ్మడికి కొంత చేతులలో పెడదామనుకున్నాను. ఇది వచ్చింది వచ్చినట్లు నీవు పుచ్చుకో -

చారుదత్తుడు : ఆ రహస్యమేమిటో ఈ దానమేమిటో!

మైత్రేయుడు : (బలవంతం చేస్తూ) ముందు ఇది పుచ్చుకో!

చారుదత్తుడు : (పుచ్చుకుంటూ) ఏమిటిది మైత్రేయా!

మైత్రేయుడు : ధూతాదేవివంటి మహాసాధ్విని పెళ్ళాడినందుకు ఫలం! మీ కష్ట సమయంలో ఇవ్వవలసిందని అక్కగారికి వదినెగారు వారి మరణ సమయంలో దీన్ని ఇచ్చినారట! ఆ కన్నం పూడ్పించను కాస్తా కూస్తా అవుతుందా.

చారుదత్తుడు : చిట్టచివరకు నాకు స్త్రీ ధనం దిక్కుకావలసి వచ్చిందా! కానీ దురదృష్టంవల్ల నేను దరిద్రుణ్ణి అయినాను - కష్టసుఖాలల్లో పాలు పంచుకునే నా ఆత్మబంధువులు మిత్రులున్నప్పుడు నేను దరిద్రుణ్ణి కాను. (కొంచెమాలోచించి) మైత్రేయా! వసంతసేన

—————————————————————————

వసంతసేన

139