Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యింటికి ఉదయమే పోయి నేను మిత్రులతో జూదమాడి నగలు ఒడ్డి ఓడిపోయినాననీ దానికి ప్రతిగా ఈ రత్నావళిని స్వీకరించమని కోరుతున్నానని చెప్పి ఇచ్చిరాపో!

మైత్రేయుడు : అయ్యో! నీకేమైనా మతిపోయిందా, పిచ్చెక్కిందా? తిన్నామా? కుడిచామా? నగలపాత్ర దొంగ లెత్తుకోపోయినారు. దానికోసం వెలలేని రత్నహారం ఇచ్చుకుంటామా?

చారుదత్తుడు: నగలపాత్రకు ప్రతిగా రత్నహారం మనమివ్వటం లేదు. వసంతసేన నామీదుంచిన విశ్వాసానికి బహూకృతి ఇది.

మైత్రేయుడు : బాగుంది - వెర్రి తీరింది. రోకలి తల చుట్టమన్నాట్ట నీబోటివాడు.

చారుదత్తుడు : (దీనంగా) మైత్రేయా! ఎలాగైనా సరే ఆమె అంగీకరించేటట్లు చేయక తప్పదు.

మైత్రేయుడు : (స్నేహావలోకనంతో అంగీకరించి రత్నావళి గ్రహించి) అయితే మరి -

చారుదత్తుడు : రత్నహారం మీద ఏవిధమైన మమకారమూ మనకున్నట్లు కనిపించకూడదు సుమా!

మైత్రేయుడు : చస్తే కనిపిస్తానా?

(నిష్క్రమిస్తాడు)

———————————————————————————

140

వావిలాల సోమయాజులు సాహిత్యం-2