Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైత్రేయుడు : నేనా! (కొద్ది గొంతుకతో) ఛాందస చక్రవర్తిని! (చిన్న నవ్వుతో) మీరిద్దరూ రాచబాటలో నడుస్తుంటే మానససరోవరంలో విహారం చేసే హంసీహంసల్లా ఉంటారు. దీపం తీసుకోరానా?

చారుదత్తుడు : (వసంతసేనవైపు చూచి నవ్వుతాడు. ఆమె కూడా అభిప్రాయాన్ని గ్రహించినట్లు నవ్వుతుంది).

మైత్రేయుడు : దీపం ముట్టించి ఉన్నదో లేదో! - (లేవబోతాడు) చారుదత్తుడు : మైత్రేయా! దీపంతో ప్రయోజనం లేదు.

(*) ప్రియమైన కాంతులతో ఆకాశానికి వెల్లవేసి కుముదినీ ప్రణయినులు వంతలు తీర్చటానికి చంద్రభగవానుడు వచ్చాడు. ఈ వెన్నెలలో నగరవీధుల్లో భయమేమాత్రమూ ఉండదు. నీవు దీపంకోసం శ్రమపడ నవసరం లేదు. పూజ్యురాలా! వసంతసేనా! (దారి చూపిస్తుంటే వసంతసేన ముందుకు నడుస్తుంది. చారుదత్తుడు వెనుక అనుసరిస్తాడు)

మైత్రేయుడు : (చతురోక్తిగా) వసంతసేన వెంట నన్ను నడవమంటా డేమిటి? నేనెందుకు, “దంపత్యో ర్మధ్య ఏవచ” - చిలుకా గోరువంకల్లా ఎంత బాగున్నారు - వసంతసేన కొంత డబ్బు పెట్టుబడి పెడితే చారుదత్తుడు మళ్లా వ్యాపారం సాగిస్తే మైత్రేయుడు.......

——————————————————————————

వసంతసేన

129