Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంభీలకుడు: వెంట మదనిక కూడా వస్తున్నది. వెర్రిచేష్టలు చెయ్యకు. వసంతసేన అందరివంటిది కాదు గణిక!

శకారుడు : ఆఁ! కణికా! మదనిక కూడా వెంట వస్తున్నదా? మరీమంచిది మనకోసం ఇద్దరినీ మాట్లాడుదాం.

కుంభీలకుడు : (నిశ్శబ్దమన్నట్లు) ఇస్! (దగ్గరకు వచ్చారని హస్తసంజ్ఞ)

శకారుడు : (మళ్ళీ దగ్గుతాడు)

కుంభీలకుడు : (దగ్గరకు వచ్చి) మదనారాధన కాగానే మదనికను పంపించివేస్తుంది. అందాకా మనం అవతలి స్తంభం చాటున నిలబడి కనిపెడుతుందాం. లే.

శకారుడు : ఉఃఁ ఉఃఁ (అయిష్టాన్ని ప్రకటిస్తాడు)

కుంభీలకుడు : (తాను బయలుదేరుతాడు. శకారుడు తప్పనిసరి ఐతే అనుసరిస్తాడు)

(ముందు మదనిక పూజాపాత్రికతో నడుస్తుంటే వెనక వసంతసేన వస్తుంటుంది. పూజాద్రవ్యాలు క్రింద పెట్టి మదనిక ప్రక్కకు తప్పుకుంటుంది. వసంతసేన మదనవిగ్రహానికి ముందుగానిల్చి నమస్కరించి నాట్యభంగిమలో సాభినయంగా అంజలించి పాట పాడుతుంది)

జయ, జయ, మధుమయ, మదనా!
జయ, జయ, యువజన, సదనా!!
ఓ జైవాతృక!
రససాంయాత్రిక!!
సుషమాసుందర!
మానసమందిర!! జయ, జయ
త్రిభువనపావన!
నవయుగజీవన!!
ఓ సుమసాయక!
ఉజ్జ్వల నాయక!!
జయ, జయ, మధుమయ మదనా!
జయ, జయ, యువజన సదనా!!

——————————————————————————

వసంతసేన

113