Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/860

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

860 హరికథా పితామహ పూర్వం ఒక కాలంలో మహాపురుషు డొక్కడుండె వాడు ఆయన కంఠాన శ్రోతల హృదయాలన్నిటి సంతోషంతో నింపగ జాలునట్టి సంగీతం నిండిఉంది ఆయన హ స్తాంగుళాలు తంత్రులపై పర్యటనం చేసినాయి ఓహో! అది ఎంతో మహో ల్లాసమ్మును తేగలదు! ఆయన - సంగీతానికి సమ్మోహితులౌ జనాన్కి శాంతి, దాన్ని తెచ్చి యిస్తు శిలకు మార్దవాన్ని ఇచ్చు రామణీయకత ఉన్నది. ఆయన మృదుగీతికాళి, ఆయన మధు సుస్వరములు ఆయన కథలను తెల్పెను ఆయన ఖ్యాతుల స్తుతించె! మహనీయుండౌ నాయన యమకాలతొ, లయలతోటి ప్లుతగమ్యం చేసినాడు, నాట్యమ్మును ఆడినాడు సర్వకాలముల అందును ఈశ్వరుకై పయనించెను ప్రవచనం గావించెను భాషలన్ని సుగమముగా ఆయనవే అయిపోయెను, ఆయన విస్మృతికిని సైతం కడు ఎరుంగబడినవాడు - పత్రములెటు వృక్షానికి నైజములో అటులె కవిత ఉల్బణముగ నాయన - ఎద నుబికి వచ్చె ఆయనలో సకలకళలు ఉత్సాహము తోటి కలుసుకొన్నాయి. ఆధిక్యత నంతటినీ రాశీభూతము గావిం చా డాయన. దర్శనమున కాయన ఘనమౌ దీపం, హృదయాలకు ఆహ్లాదం పరమేశుని వీక్షించిన అట్టివారె భీతితోడ ప్రణామమ్ము, లాచరించి నారు ఆయనెవ్వరికిని - పరమశక్తిమంతుడైన పరమాత్మకు తప్పవంద నమ్మునాచరింపలేదు కంఠమ్ములు ఏకతాన వావిలాల సోమయాజులు సాహిత్యం-1