దేహంలో జ్ఞానరత్న
మును హరింప నున్నారు
అందువల్ల జాగరూక
తను వహింపవలెను నీవు
విస్తృతమౌ ప్రాపంచిక
కదనక్షేత్రమ్ము నందు
జీవితాన శాత్రవభయ
హేతువుచే రాత్రులందు
జాగృతి వహియించువేళ
మూక చలిత జంతువు లటు
ఉండవద్దు. ధైర్యముతో
వీరునివలె వర్తింపుము.
సౌఖ్యంలో ఆపదలో
ఏకరూపమున నుంటా
రు మహాపురుష శ్రేష్టులు
సూర్యుడు ఉదయించు వేళ
అస్తమించు వేళ రక్త
వర్ణంతో ఉండునుగద!
రవి పగటిని, శశిరాత్రిని
భాసింపగ జేస్తారు.
బుద్దిమంతు డయినకొడుకు
కుటుంబాన్కి పూర్తిగాను
వన్నె తెచ్చిపెడతాడు.
—♦♦♦♦§§♦♦♦♦—
49 నారాయణదాస! భట్ట!!
మహాభక్త! ఆదిభట్ట!!
"శక్తివైన ఓ నీవా!
శక్తివంతు గావింపుము
వీర వైన ఓవీరా! నను
వీరుని గావింపు తల్లి!!"
ఈ ప్రార్థన పఠియించిన
వెనుక మిమ్ము మీ శిష్యులు
“రసికులు తమ శక్తికొలది
పసనెరుగంగా గలరు
మీ వచనం ప్రతి ఒక్కటి
ఒక కురంటి[1], ఒక చిరంటి[2]!
ఒక సాకే తెచ్చి యిచ్చు
ఉజ్వలరస భృంగారము[3].
ఏమైనా చెప్పు డనిన
ఈ రీతిగ నుడివినారు!
భక్ష్య[4] భోజ్య[5] చోష్య లేహ్య[6]
ముల నాల్గిటిలోన ఉన్న
షడ్రుచులను "షాడబరుచి[7]
ఎరిగిన భోజనప్రియుడ!
కామినీ జనమ్ము కామ
సౌఖ్యాలను కోరి ఇంద్రు
వలన పుచ్చుకొన్నారు
ఈ నారులు లోకంలో
ప్రేమయాత్ర లెన్నింటిని
ప్రీతితోడ నడిపినట్టి
పర్యాటక సారథులు.
నారి లేని ఇల్లు వృథా!
నారిలేని విల్లు వృథా!!
నగ్న అయిన స్త్రీని చూచి
ఎవని మనసు చలియింపదొ
అతడు యోగి, సత్యమ్ముగ
"ఉన్న దొక్క కూతు రయిన
ఊరంతా అల్లుళ్లే”
అన్న కీర్తి ఆర్జించిన
- ↑ కురంటి-తుమ్మి పచ్చగోరంట పచ్చచేమంతి
- ↑ చిరంటి - జవరాలు ఐదువరాలు
- ↑ భృంగారము - బంగారుగిండి
- ↑ భక్ష్యము - కొరికి తినునది
- ↑ భోజ్యము - నోటితో మ్రింగి తినునది
- ↑ చోషణము - నీటితో పీల్చి తినునది, లేహ్యము - నాలుకకు వ్రాసుకొని రుచి ననుభవిస్తూ తినునది
- ↑ షాడబము - తీపి మొదలయిన రుచుల కలయిక, మధురాది రసము
________________________________________________________________________________
ఉపాయనలు
845