Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/844

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మనకు మిత్రులను గానీ
మనకు శత్రులను గానీ
మన ప్రవర్తనే కూర్చును
ప్రేమ బాధలను సహించు,
ఎట్టి ప్రతీకారమ్మును
గావింపదు, తలపోయదు.
హింసతోటి సాధింపగ
గలిగినట్టి హిత మెయ్యది
లోకంలో కనుపించదు.
నిందగాని, స్తుతిగానీ
వాయుతరంగాల బోలి
ఉంటాయి ఆ నిందా
స్తుతుల ప్రభావాని కెపుడు
లొంగిపోవగా చెల్లదు
నీలో కోరికలు పెరిగి
పోతు ఉన్నకొద్ది నీలో
శోకము సైతమ్ము ఎంతో
పెరిగి పెరిగి పోతుంది.
యత్నమొనర్చుట వరకే
మన బాధ్యత ఫలితమ్మును
భగవానుడె చూచుకొనును
దేహానికి ఆహారం
ఎటువంటిదో ఆత్మకు ధ్యా
నమ్ము సైత మటువంటిది.
ముందు సేవకుడివి గాను
ఉండటమ్ము నేర్చుకొమ్ము,
అంతట అధికారివిగా
ఉండేటందుకు అర్హత
లభ్య మ్మై తీరుతుంది.
పరులను దూషించువాడు,
కడుసోమరి, పిసినిగొట్టు,
దీర్ఘకోపి ఈ నల్వురె
లోకమందు అస్పృశ్యులు
నీ బాధకు కారణ మెవ
రైన నేమి? నీవు మాత్ర
మితరుల కే బాధను కలి
గింపవద్దు - ఎన్నండును
జ్ఞానరహిత మైన కర్మ
నిష్ప్రయోజన మ్మయినది
కర్మరహితమౌ జ్ఞానము
ఉపయోగము లేనట్టిది.
సరస్వతీ యమునా గం
గలు అకార ఉకారమ
కారాలని జాగ్రత్స్వ
ప్నమ్ము నిద్రల కార ఉకా
రమ కారాలని తెలియుము.
మూలమందు బ్రహ్మ మధ్య
మందు విష్ణు వగ్ర మందు
శివుడ వైన వృక్షరాజ!
అశ్వత్థా! నీకు నతులు
దీక్షతోడ సాగరమ్ము
లోన నింత లోతు దిగిన
అన్ని రత్నములు లభించు.
అట్లె పురాణాల లోన
విల్వ గల్గు విషయమ్ములు
మనకు లభ్యమౌతాయి.
కామ, క్రోధ, లోభాలను
చోరవరులు చేరినారు


844

వావిలాల సోమయాజులు సాహిత్యం - 1