ఏ జీవుడు ఆత్మ నెరుగు
ఆ జీవుడు ఆత్మయౌను
సంసార మనే విషవృ
క్షమ్మునుండి సత్సాంగ
త్యమ్ము సాహితీ ఆరా
ధన అనియే రెండు సత్ఫ
లాలు లభ్యమౌతాయి
శ్రద్ధలేనివారికి హిత
బోధచేయు టతివ్యర్థము
ఇంద్రియనిగ్రహము లేని
వారికి బోధించు విద్య
నిష్ప్రయోజన మ్మౌను
మోక్ష మంటె వ్యక్తిత్వం
కోలుపోవటమ్ము కాదు
పరమాత్మను తానుగాను
స్వస్వరూపముగను నెరిగి
అనుభూతిని పొందటమే
ప్రతి ఒక్కని జీవితమ్ము.
భగవాను ప్రణాళికలో
నియమించిన ఒక భాగం.
ఆధ్యాత్మికత నియెడునది
కారణాన్ని తిరస్కరణ
చేయునట్టి దెపుడు కాదు,
దాని నధిగమించునది
ధ్యానం ద్వారాను శ్వాస
స్వాధీనంలోకి చేరు
కుంటుంది, మనసులోన
ప్రాణము లయ నొందుతుంది.
సంకల్ప వికల్పాలు
నాశనమ్ము నొందుతాయి.
శాంతి లభ్యమౌతుంది.
భోగవాంఛ బంధమౌను.
వాంఛాశూన్యత మోక్షము.
నీవు నీదు గౌరవాన్ని
ఏ దినాన కోల్పోతా
వో ఆదినమందు నీవు
ఈ లోకంలో లేని
వాడవె అయిపోతావు
ఎవ్వడు తన ఇంద్రియాల
నిగ్రహించుకోగలడో
అతడు స్థితప్రజ్ఞానిధి
సత్యమ్మును మించిన ధ
ర్మమ్ము లేదు సత్యసంధు
లయివర్తించే వారికి
పరమేశ్వర సాక్షాత్కా
రమ్ము లభ్యమౌతుంది!
జపతపాలు గావించెడి
వారికంటే ఎల్లప్పుడు
సంతోషముతో ఉల్లా
సమ్ముతోటి చిరునవ్వుల
తో జీవించేటివారె
పరమేశ్వర సన్నిహితులు
ఓర్పుతోటి సాటి అయిన
అట్టి తపము కానబడదు,
సంతుష్టిని మించినట్టి
సౌఖ్య మెదీ కానబడదు,
దయను మించు నట్టిదైన
ధర్మమెదీ కానబడదు
________________________________________________________________________________
ఉపాయనలు
843