శిష్యకోటి కెన్నో ఇట్టి
సూక్తులు వినిపిస్తారు.
మానవుండు తన్నుతానె
రక్షించుకొనంగా వలె
భేదింపగ రానియట్టి
దుర్గంగా వర్తిలవలె
సజ్జనులతొ స్నేహమ్ము, పు
రాణశ్రవణమ్ము దైవ
చింతనమ్ము మొదలైనవి
జ్ఞాన ప్రస్థానంలో
ప్రథమమైన మజిలీలు!
ఉపకారం చెయ్యడమే
ఉత్తమమౌ ధర్మమ్ము
నేర్పుతో కర్మలు చేయుట
ఉత్తమమౌ నర్థమ్ము
పాత్రోచితమౌ దానమె
పరమోచితదానమ్ము
జగము సర్వమును మనసే,
ముల్లోకములును మనసే,
ఆ మనసే, సంసారము,
అది స్వాధీనమ్మయితే
సర్వము స్వాధీనమ్మౌ!
నిద్రను స్వప్నాల చేత,
స్త్రీలను ఆసక్తులతో,
అగ్నిని చిదుగులచేత,
దాహమ్మును మద్యంతో,
ఓడింపగా లేము
కలియుగమ్ములో ఇప్పుడు
దోషాలెన్నున్ననేమి!
సుగుణ మ్మొకటున్న దద్ది
శ్రీకృష్ణుని సంకీర్తన
రామనామమునకు సాటి
లే దెయ్యది? సంసారపు
దుఃఖమ్మును మొలకలోనె
నాశనమ్ము గావించును
ఏకైక మ్మగు భక్తితో
శివుని, రాము, మహావిష్ణు
ఎవ్వరి నే రూపంలో
ఆరాధించినను నీవు
మోక్షాన్నే పొందుతావు.
మరణించిన తరువాతను
వెంటవచ్చునది ధర్మము
అదియే నిజమైనయట్టి
నేస్తమ్ము మిగిలినవ
న్నియు దేహము తోబాటే
అంతరించి పోతుంటవి
వైరాగ్య మ్మనెడి ప్రమిద
భక్తి అనే తైలమ్మును
ఏకాగ్రత అనెడి వత్తి
తత్త్వవిచారణ అనియే
అగ్నిఉంటె జ్ఞానజ్యోతి
బహు చక్కగ వెలుగుతుంది
అంతరంగమందున శ్రీ
నారాయణుడుండు వారి
ఆనందానికి నేవిధ
మైనలోప ముండబోదు
సాగరంలొ సంగమించి
నది సాగర మైనట్లుగ
842
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1