వీరమాతలకు హేతువు
చర్చనీయమౌ అంశము.
ప్రేమికులను వలుసంఖ్యగ
పొందునట్టి సమ్మోహన,
సుప్రసిద్ధ 'మెస్సాలిని'
కెవ్వ రెపుడు పూర్ణముగా
సంగమసుఖ మివ్వ లేక
పోవటాన్ని తెలుపుకొన్న
రోమక విట విఖ్యాతులు
మెచ్చి ఆమె కీర్తింపగ
"అవిజే" తను ఘనబిరుదము
సంప్రీతితొ ఇచ్చినారు.
అవిజేతతో పోల్పంగా
దగినట్టిది, అంతకంటె
వీరవనిత “అజముఖి" అను
నామంతో పురాణాన
గొప్పగ కనిపిస్తున్నది.
“అజముఖి” ఎవ రంటారా?
సురస కశ్యపుల కూతురు,
శూరసురల, పద్మాదుల
ప్రియసోదరి. లావణ్యల
లాంపట్యము సర్వమ్మును
త్రోసిపుచ్చి, ఈమె తనకు
అందగాడుగా తోచెడు
వీరవరుని ప్రతిఒక్కని
పట్టి తెచ్చి శయ్యజేర్చి,
సంగమించు టందు శక్తి
సర్వమ్ము ప్రదర్శించు
అవిజేతవు నీవు తన్వి”
అని అందరి చేతను ఒ
ప్పించి తృప్తి నొందెడిది.
పలువీరులతో నీ గతి
గడిపి నట్టి మహాభయద
రతికేళి వీరనారి
అజముఖి ఆ దుర్వాస మ
హర్షి చూచి ఆయన శ
క్తిని పరీక్షచేయ దలచి
సంయోగము గావింపగ,
తనను అట్లు అవమానిం
చుట నోర్వక శాపమొసగి
గర్భధారణము నొందగ
జేసినాడు, వాతాపీ
ఇల్వలు లను జనహంతకు
లయినవారి కనియె నామె
పరుగులెత్తు మెరపు తీవ
చాంచల్యము, క్షురాఖడ్గ[1]
గతతీర్ణత, వాయువర్ణ
నాతీతమ్మగు వేగము
నెలతల ఎదలందు నిత్య
మును నుండుట మీకు ఎరుక
మీ రెన్నడు చక్రాటుల[2]
వర్ణాటుల[3], భావాటుల[4],
అన్యమైన దోషాటుల[5]
వశ మెన్నడు కారాదు
ఎచట స్త్రీలు పూజింపం
గాబడుదురొ అచట దేవ
తాజాలము పూజింపం
గా బడుదురు. ఎద్ది కంటి
కింపో అది కడుపు కింపు
గణికామణులును, శిల్పులు
- ↑ క్షురాఖడ్గము - వాడి అయిన అంచుగల కత్తి
- ↑ చక్రాటులు-దేవాలయస్థల పుజా మందిరంలో తిరుగువారు
- ↑ వర్ణాటులు - గాయకులు చిత్రలేఖకులు, ఆడదానివల్ల బ్రతికేవారు
- ↑ భావాటులు - మనో వికారభావాలతో స్థిమితం లేక తిరుగుచుండువారు
- ↑ దోషాటులు - చౌర్య వ్యభిచార హింసాది దుశ్చేష్టల్లో తిరుగువారు
________________________________________________________________________________
846
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1