Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/835

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాన్యులైన మానవులకు
“మహామహుడు, ధీమాన్యుల
కత్యద్భుత ధిషణాధూ
ర్వహుండు, హరిదాసాళికి
హరికథాపితామహుండు
కవిజనులకు మహాసుకవి,
గాయకులకు గాంధర్వసు
చక్రవర్తి, నర్తకులకు
నందీశుడు, నటులకు నొక
మహానటుడు, భక్తాళికి
పరమ మహాభాగవతుడు
భాషావేత్తలకు బ్రహ్మి
ష్ణో బ్రహ్మ, సర్వశాస్త్ర
విద్వాంసుల కక్షపాదు
డా పౌరాణికుల బాద
రాయణుండు, వేదాంతుల
కా అనాది శంకరుండు
ధార్మికులకు ధర్మజుండు
వనితల కంటికి వంచిత
పంచాస్త్రుడు, కామధేను
వా కళావతులకు వదరు
బోతులకును వావదూక[1]
వల్లభుండు, మితభాషులు
వాచంయమి[2], నిక్కుబోతు
లౌవారికి అంకుశమ్ము
లేని గంథ సింధురమ్ము,
నాగరికుల నవఖండ మ
హీమండల ఆఖండుల
చక్రవర్తి, జానపదుల
సత్తెకాల సత్తెయ్యయు
మహాభాగు డౌ నాయన
జీవితాన్కి, వ్యక్తిత్వాన్కి
వైదుష్యాన్కి ఏతా మె
త్తెటందుకు సాధ్యపడదు.
నీరాజన మెత్తటాన్కి
సంకల్పము చేశాము.
సరస్వతీప్రసాదు లైన
దాసుగార్కి జగద్గురువె
అయినయట్టి పరమేశుడె
జగద్గురువు. ఆయన వి
ద్యలు సర్వం స్వయంకృషిని
లబ్ధమ్ములు హరి కరుణా
కటాక్ష సంప్రాప్తమ్ములు.
అందువల్లనే ఆయన
తన నేర్పుల నన్నింటిని
జగజ్జన తారకమౌ
హరికీర్తన కోసమ్మే
వినియోగమొనర్చినారు.
తనదు సకల కళాకౌశ
లముల కెల్లగాను సాంద్ర
విద్యాకేంద్రమ్ము గాను
తీర్చిదిద్దుకొన్నాడు.
ఆంధ్రదేశ మందలి ప్ర
ప్రథమమైన సంగీతక
ళాశాలకు ప్రప్రధమ ప్ర
ధానాచార్యుండు అయ్యు
హరికథకు పితామహుండు
గా జగమ్మునను సరస్వ

  1. వావదూకలు - వాగుడుగాండ్రు
  2. వాచంయమి-మునులలో శ్రేష్ఠుడు

ఉపాయనలు

835