సురలోకుల జన్మంబును
ఆ ఏఱుల జన్మంబును
ఎవరి కెరుక అనుచు నొక్క
నమస్కార మెసగనిచ్చి
ఊరకుంట ఎంతో లెస్స!
నారాయణ దాసుగారు
భక్తికొరకు బ్రతికినారు
తిండికోసం కాదు
రుచికోసం తిన్నారు.
అందం కోసమ్ము స్త్రీని
ఆరాధించారు గాని
భోగముకోసమ్ము కాదు.
కళావతుల నాదరించి
నారు కాని కామము కో
సమ్ముకాదు ఆస్తిక్య ప్ర
చారార్థము, ధర్మము బో
ధింపంగా హరికథ చే
పట్టినారు అది హరికో
సమ్ము కాదు సిరికోస
మ్మును కాదు కథారక్తి
కొరకాయన కలమును చే
పట్టినారు గాత్ర మెత్తి
నారు, గజ్జ కట్టినారు
ఆదిభట్ట కివి ఎవ్వ
ఆ యశస్సుకొరకు కాదు.
ఆ మహామహుండు బ్రతుకు
గహనమ్మున వేసుకొన్న
బాటవేరు వారు నడుచు
నట్టి నడక ఎంతో నేరు
ఆపాటీ ఈపాటీ
అయినవారి కది ఎంతో
దురవగాహ మైనతీరు!
“నావి నాల్గు మోము లవున!
ఎటు ముద్దిడగాగల" వని
అంటు నల్వ ఆప్యాయన
గా హసింప “నే ననంత
ముఖిని నన్ను ఎట్లు ముద్ది
డగా గల" వటంచు చెల్వ
నవ్వ “ముద్దిడెదను చూడు”
మన్న నల్వ నారాయణ
దాసుగాగ సిగ్గువడెడు
శ్రీ సరస్వతీదేవికి
“చెప్పుకొందు నానమస్సు”
భిన్న భిన్న సమయమ్ముల
శ్రీ జోగారాయ సుకవి
మిమ్ము గూర్చి వెల్లడించి
నట్టి భావనారీతులు
"బహిరంతరముల విశిష్ట
లక్షణత, విలక్షణతల
నొప్పెడు గుణబంధురుండు,
వివిధ విద్యలను విశార
దుండు, సకలకళాకౌశ
లాల మహాపేశలుండు
బహు భాషాచతురాస్యుడు”
అయిన అట్టి దాసుగారి
వ్యక్తిత్వము నాకళించు
కొనుట కొక్క రేవెక్కడ
కనుపించదు. ఆయన సా
________________________________________________________________________________
834
వావిలాల సోమయాజులు సాహిత్యం - 1